News April 4, 2024
ఆదిలాబాద్: 3.55 లక్షల మందికి జీరో బిల్

కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారెంటీ పథకాల్లో గృహజ్యోతి పతకానికి సంబంధించిన అర్హులకు మొదటి నెల జీరో బిల్లులను జారీ చేశారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా మొత్తంలో 8.14 విద్యుత్ కనెక్షన్లు ఉండగా.. 3.55 లక్షల మంది 200 యూనిట్ల లోపు విద్యుత్ వినియోగించినట్లు గుర్తించారు. దీంతో మార్చి నెలలో 3.45 లక్షల మందికి రూ.9.38 కోట్ల రాయితీతో జీరో బిల్లులను అందించారు.
Similar News
News February 6, 2026
ఆదిలాబాద్: POLYCETకు దరఖాస్తు చేసుకోండి

ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో చేరి బంగారు భవిష్యత్తుకు బాటలు వేయాలని ఆదిలాబాద్ సంజయ్ గాంధీ పాలిటెక్నిక్ కళాశాల అధ్యాపకులు బీ.సాయన్న సూచించారు. POLYCET ప్రవేశ పరీక్ష గురించి ఇచ్చోడ, బజరత్నుర్, జాతర్ల, పిప్రి, సోనాల పార్ది బీ ప్రభుత్వ పాఠశాలలో అవగాహన కల్పించారు. పదో తరగతి విద్యార్థులకు పాలిటెక్నిక్ గురించి వివరించారు. పాలిసెట్ ఎంట్రన్స్ కోసం దరఖాస్తు చేసుకునే విధానం గురించి వివరించారు.
News February 6, 2026
ఆదిలాబాద్: ప్రకృతి వ్యవసాయంతో లాభాలు: డీఏఓ

ప్రకృతి వ్యవసాయం చేయడం వల్ల భూసారం పెరగడమే కాకుండా, పెట్టుబడి ఖర్చు తగ్గి దిగుబడి పెరుగుతుందని డీఏఓ శ్రీధర్ స్వామి సూచించారు. ఆదిలాబాద్ ఉద్యాన పరిశోధన స్థానంలో జిల్లాలో ఎంపిక చేసిన 20 క్లస్టర్లలోని 40 మందికి కృషి సఖిలకు ప్రకృతి వ్యవసాయంపై నిర్వహించిన శిక్షణ తరగతులు శుక్రవారం ముగిశాయి. ప్రకృతి వ్యవసాయం ద్వారా అనేక లాభాలు ఉన్నాయన్నారు. ఉద్యాన పరిశోధన స్థానం శాస్త్రవేత్త మల్లేష్ పాల్గొన్నారు.
News February 6, 2026
ఆదిలాబాద్: దేశ రక్షణకు భారత సైన్యంలో చేరాలి: కలెక్టర్

దేశ రక్షణలో భాగస్వాములు కావాలనుకునే యువతకు భారత సైన్యం గొప్ప వేదికని కలెక్టర్ రాజర్షి షా పేర్కొన్నారు. శుక్రవారం ఆదిలాబాద్‌లోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో సికింద్రాబాద్ ఆర్మీ రిక్రూటింగ్ ఆఫీస్ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. భారత సైన్యంలో చేరడం అంటే కేవలం ఒక ఉద్యోగాన్ని సంపాదించడం కాదని, అది దేశం పట్ల మమకారాన్ని చాటుకునే ఒక గౌరవప్రదమైన జీవనశైలి అని అన్నారు.


