News March 2, 2025
ఆదిలాబాద్ AIRPORT కలగానే మిగిలిపోతుందా..?

ఆదిలాబాద్‌లో AIRPORT కలగానే మిగిలిపోతోంది. రెండు రోజుల క్రితం కేంద్ర ప్రభుత్వం వరంగల్ AIRPORTకు అనుమతులు మంజూరు చేసిన విషయం తెలిసిందే. కాగా జిల్లాలో కూడా ఎయిర్ పోర్టు నిర్మాణానికి త్వరగా అడుగులు పడేలా చర్యలు తీసుకోవాలని జిల్లావాసులు కోరుతున్నారు. AIRPORT నిర్మాణానికి స్థలం ఉన్నప్పటికీ దానికి సంబంధించిన పనులు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వలు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
Similar News
News March 25, 2025
ఆదిలాబాద్‌కు వచ్చిన కేంద్ర బృందం సభ్యులు

జిల్లాలోని నార్నూర్ పర్యటనలో భాగంగా మంగళవారం కేంద్ర బృందం సభ్యులు ఆదిలాబాద్‌కువచ్చారు. డైరెక్టర్ మృత్యుంజయ ఝా, శుభోద్ కుమార్ డిప్యూటీ సెక్రటరీలను స్థానిక పెన్‌గంగా గెస్ట్ హౌస్‌లో జిల్లా కలెక్టర్ రాజర్షి షా మర్యాద పూర్వకంగా కలసి పూలమొక్కను, జ్ఞాపికను అందజేశారు. ఈ సందర్భంగా వారితో పలు అంశాలపై చర్చించారు.
News March 25, 2025
ADB: నేటితో ముగియనున్న డిగ్రీ పరీక్ష ఫీజు గడువు

కాకతీయ యూనివర్సిటీ డిగ్రీ 2, 4, 6వ సెమిస్టర్ల పరీక్ష ఫీజు గడువు నేటితో ముగుస్తుందని అధికారులు తెలిపారు. విద్యార్థులు త్వరగా ఫీజు చెల్లించాలని సూచించారు. అలాగే ప్రతి విద్యార్థి తమ అపార్ ఐడీని ఆధార్ కార్డ్ జిరాక్స్‌ను కళాశాలల్లో ఇచ్చి లింక్ చేసుకోవాలని పేర్కొన్నారు.
News March 25, 2025
గాదిగూడ: తల్లిదండ్రులు మృతి.. అనాథగా పిల్లలు

అభం శుభం తెలియని పసిపిల్లల జీవితాలతో విధి ఆడుకుంది. తల్లిదండ్రులను దూరం చేసి వారిని అనాథలుగా మార్చింది. గాదిగూడలోని దాబా(కే) గ్రామానికి చెందిన సోయం కిషన్(37) అనారోగ్యంతో శనివారం మృతిచెందగా ఆయన భార్య తూర్పబాయి 2021లో మృతిచెందింది. దీంతో వారి పిల్లలు దేవరావు, రాజేశ్వరి అనాథలుగా మారారు. తల్లిదండ్రులను కోల్పోవడంతో దిక్కుతోచని స్థితిలో ఉన్న వారిని దాతలు ఆదుకొని భవిష్యత్తుకు దారి చూపాలని వేడుకున్నారు.