News March 2, 2025
ఆదిలాబాద్ AIRPORT కలగానే మిగిలిపోతుందా..?

ఆదిలాబాద్‌లో AIRPORT కలగానే మిగిలిపోతోంది. రెండు రోజుల క్రితం కేంద్ర ప్రభుత్వం వరంగల్ AIRPORTకు అనుమతులు మంజూరు చేసిన విషయం తెలిసిందే. కాగా జిల్లాలో కూడా ఎయిర్ పోర్టు నిర్మాణానికి త్వరగా అడుగులు పడేలా చర్యలు తీసుకోవాలని జిల్లావాసులు కోరుతున్నారు. AIRPORT నిర్మాణానికి స్థలం ఉన్నప్పటికీ దానికి సంబంధించిన పనులు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వలు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
Similar News
News November 19, 2025
సంగారెడ్డి: రేపటి నుంచి బడిబాటి పిల్లల సర్వే

సంగారెడ్డి జిల్లాలో ఈనెల 20 నుంచి డిసెంబర్ 19వ తేదీ వరకు బడిబాట పిల్లల సర్వే నిర్వహిస్తున్నట్లు డీఈవో వెంకటేశ్వర్లు బుధవారం తెలిపారు. సీఆర్పిలు, ఐఈఆర్పీలు DLM T తమ ప్రాంతాల పరిధిలో బడిబాట పిల్లల సర్వేలు నిర్వహించాలని సూచించారు. బర్త్ డే పిల్లల వివరాలను ప్రబంధ పోర్టల్‌లో వెంటనే నమోదు చేయాలని ఆదేశించారు.
News November 19, 2025
సంగారెడ్డి: పోలీసు సిబ్బంది సంక్షేమానికి ప్రాధాన్యత: ఎస్పీ

పోలీస్ సిబ్బందికి పంపిణీ చేసే గ్యాస్ ఆటోను ఎస్పీ పారితోష్ పంకజ్ జిల్లా పోలీసు కార్యాలయంలో బుధవారం ప్రారంభించారు. ఎస్పీ మాట్లాడుతూ.. నిత్యం విధుల్లో బిజీగా ఉండే పోలీసు సంక్షేమానికి ప్రత్యేకంగా చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. గ్యాస్ ఆటో ద్వారా త్వరగా సిలిండర్ అందే అవకాశం ఉంటుందన్నారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ రఘునందన్ రావు పాల్గొన్నారు.
News November 19, 2025
చరిత్ర లిఖించిన అతిచిన్న దేశం.. FIFA వరల్డ్ కప్‌కు అర్హత!

కరీబియన్ దీవి దేశమైన కురాకో FIFA ప్రపంచ కప్‌కు అర్హత సాధించి చరిత్ర సృష్టించింది. కేవలం 1.56 లక్షల జనాభా కలిగిన ఈ దేశం ప్రపంచ కప్‌కు అర్హత సాధించిన అత్యంత చిన్న దేశంగా రికార్డు నెలకొల్పింది. గతంలో ఐస్లాండ్ పేరిట ఉన్న రికార్డును ఇది బద్దలు కొట్టింది. జమైకాతో జరిగిన కీలక క్వాలిఫయింగ్ మ్యాచ్‌లో 0-0తో డ్రా చేసుకొని 2026 WCలో స్థానం సాధించింది. అర్హత సాధించడంతో ప్లేయర్లు ఎమోషనలయ్యారు.


