News March 2, 2025

ఆదిలాబాద్ AIRPORT కలగానే మిగిలిపోతుందా..?

image

ఆదిలాబాద్‌లో AIRPORT కలగానే మిగిలిపోతోంది. రెండు రోజుల క్రితం కేంద్ర ప్రభుత్వం వరంగల్ AIRPORTకు అనుమతులు మంజూరు చేసిన విషయం తెలిసిందే. కాగా జిల్లాలో కూడా ఎయిర్ పోర్టు నిర్మాణానికి త్వరగా అడుగులు పడేలా చర్యలు తీసుకోవాలని జిల్లావాసులు కోరుతున్నారు. AIRPORT నిర్మాణానికి స్థలం ఉన్నప్పటికీ దానికి సంబంధించిన పనులు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వలు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

Similar News

News March 27, 2025

భద్రాద్రి: జిల్లాలో కాంగ్రెస్ ప్రక్షాళన జరుగుతుందా?

image

కాంగ్రెస్ పార్టీ ఇన్‌ఛార్జి మీనాక్షి నటరాజన్ పార్టీని మరింత బలోపేతం చేయడంపై ఫోకస్ పెట్టారు. 18 ఏళ్ల తర్వాత జిల్లా కాంగ్రెస్ కమిటీలతో నేడు ఢిల్లీలో మీటింగ్ పెట్టనున్నారు. ఇందులో భాగంగా జిల్లా, బ్లాక్, మండల కాంగ్రెస్ అధ్యక్షుల ఎంపిక ఉంటుందని టాక్. KTDM జిల్లా డీసీసీ చీఫ్‌గా పోదెం వీరయ్య ఉన్నారు. అయితే ఈ పదవి కోసం కాంగ్రెస్ సీనియర్ నేతలు చాలామంది పోటీపడుతున్నారు. ఈ పదవి ఎవరికి దక్కుతుందో చూడాలి మరి.

News March 27, 2025

వరంగల్ : బైకును ఢీ కొట్టిన లారీ.. బాలుడు మృతి

image

వరంగల్ జిల్లా సంగెం మండలం గవిచర్లలో విషాదం చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. బైకుపై వెళ్తున్న యువకుడిని లారీ ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. గవిచర్లకి చెందిన గాలి చందు (17) బైక్‌పై ఆశాలపల్లి వైపు వెళ్తున్నాడు. ఈ క్రమంలో కంటైనర్ లారీ ఢీకొట్టడంతో చందు అక్కడికక్కడే మృతిచెందాడు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

News March 27, 2025

వనపర్తి జిల్లాలో మండుతున్న ఎండలు..! 

image

వనపర్తి జిల్లాలో గరిష్ఠ ఉష్ణోగ్రతలు కొనసాగుతున్నాయి. అత్యధికంగా కనాయిపల్లిలో 40.9℃ ఉష్ణోగ్రత నమోదైంది. రేమద్దుల 39.8, కేతేపల్లి 39.7, పెబ్బేరు, వెల్గొండ 39.6, గోపాలపేట 39.4, దగడ 39.3, విలియంకొండ 39.2, విపనగండ్ల 39.1, శ్రీరంగాపురం, పంగల్ 39, జనంపేట, ఆత్మకూర్ 38.9, రేవల్లి 38.8, వనపర్తి 38.7, మదనాపురం 38.6, సోలిపూర్ 38.4, పెద్దమందడి 38.1, ఘనపూర్ 37.9, అమరచింతలో 37.7℃ ఉష్ణోగ్రత నమోదైంది.

error: Content is protected !!