News July 13, 2024

ఆదిలాబాద్: DOST రిపోర్టింగ్‌కు మరొ అవకాశం

image

డిగ్రీ కళాశాలలో చేరేవారికి విద్యాశాఖ మరో అవకాశం కల్పించింది. DOST ద్వారా మూడు విడతల్లో సీట్లు పొంది కాలేజీల్లో స్వయంగా రిపోర్టింగ్ చేయాల్సిన గడువు నిన్నటితోనే ముగియాల్సి ఉంది. అయితే విద్యార్థుల విన్నపం మేరకు ఈ నెల 18 వరకు గడువు పొడగించారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా విద్యార్థులు ఈ విషయాన్ని గమనించి సద్వినియోగం చేసుకోవాలని అధికారులు సూచించారు. SHARE IT

Similar News

News October 29, 2025

ఆదిలాబద్: ‘జనన బరువు ఆధారంగా శిశు మరణాల విశ్లేషణ చేయాలి’

image

ఆదిలాబాద్ జిల్లాలో నవజాత శిశు మరణాలను తగ్గించే దిశగా పటిష్ఠ చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ రాజార్షి షా అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్‌లో ఆరోగ్య శాఖ, వైద్యాధికారులతో సమావేశం నిర్వహించారు. బీబీనగర్ ఎయిమ్స్ ప్రొఫెసర్ త‌నిగై నాథన్ జిల్లాలో గత నెలలో నమోదైన శిశు మరణాల గణాంకాలు, జనన బరువు ప్రకారం విభజన, సంబంధిత గ్రామాలు, తల్లుల ఆరోగ్య వివరాలు, తీసుకున్న చర్యలు తదితర అంశాలను వివరించారు.

News October 28, 2025

ఆదిలాబాద్: పోగొట్టుకున్న బ్యాగ్‌ను బాధితురాలికి అప్పగించిన పోలీసులు

image

గ్రామానికి వెళ్లే క్రమంలో సునీత అనే మహిళ బంగారు, వెండి ఆభరణాలు ఉన్న బ్యాగును ఆటోలో మరిచిపోయింది. ఈ విషయంపై వెంటనే ఆదిలాబాద్ బస్టాండ్‌లోని పోలీస్ సబ్ కంట్రోల్‌లో ఫిర్యాదు చేయగా స్పందించిన ఏఆర్ ఎస్ఐ ఎల్.దినకర్, మహిళా కానిస్టేబుల్ అపర్ణ కలిసి బాధితురాలు సునీత, పిల్లలు తెలిపిన ఆధారాల ప్రకారం ఆటో కోసం వెతకారు. ఆటోడ్రైవర్ జావిద్ నిజాయతీ చాటుకుని తిరిగి తన బ్యాగ్‌ను బాధితురాలికి అందించారు.

News October 28, 2025

ఆదిలాబాద్: ‘ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోవాలి’

image

ANM, ఆశావర్కర్లు, అంగన్‌వాడీ సిబ్బంది సమన్వయంతో ప్రతి గర్భిణిని గుర్తించాలని కలెక్టర్ రాజర్షి షా అన్నారు. తల్లుల పోషకాహారం లోపం, గర్భధారణ సమయంలో వైద్య పరీక్షలు చేయించుకోకపోవడం, అనారోగ్య పరిస్థితుల్లో సమయానికి వైద్యసేవలు అందకపోవడం వంటి కారణాల వల్ల తక్కువ బరువుతో పుట్టిన శిశువుల సంఖ్య పెరుగుతోందన్నారు. వైద్య, శిశు సంక్షేమ శాఖలు సమన్వయంతో ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని సూచించారు.