News March 22, 2024
ఆదిలాబాద్ MPకి హైకమాండ్ బుజ్జగింపులు..!

ఆదిలాబాద్ ఎంపీ సోయం బాబురావుకు జాతీయస్థాయిలో నామినేటెడ్ పోస్ట్ బీజేపీ హైకమాండ్ ఆఫర్ చేసినట్లు తెలిసింది. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో ఎంపీ సీటును బాబురావుకు కాకుండా బీఆర్ఎస్ నుంచి బీజేపీలో చేరిన నగేశ్‌ను ఆదిలాబాద్ ఎంపీ అభ్యర్థిగా ప్రకటించింది. దీంతో సోయం తీవ్ర అసంతృప్తికి లోనయ్యారు. బీజేపీ నుంచి కాంగ్రెస్‌లో చేరే ప్రయత్నాలు చేసినట్లుగా వార్తలు వచ్చాయి.
Similar News
News March 17, 2026
ADB: రెండు, మూడు రోజుల్లో శనగ కొనుగోళ్లు ప్రారంభం

ఆదిలాబాద్ జిల్లాలో రెండు మూడు రోజుల్లో శనగ కొనుగోలు కేంద్రాలను ప్రారంభించనున్నట్లు మార్క్‌ఫెడ్ DM ప్రవీణ్ కుమార్ తెలిపారు. క్వింటాల్‌కు రూ. 5,875 మద్దతు ధరతో ప్రభుత్వం కొనుగోలు చేయనుందని పేర్కొన్నారు. రైతులు తమ పంటను శుభ్రపరిచి, తేమ శాతం 14% మించకుండా ఆరబెట్టి కేంద్రాలకు తీసుకురావాలని సూచించారు. గ్రామాల వారీగా కేటాయించిన తేదీల్లోనే పంటను తేవాలని, ఈ అవకాశాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
News March 17, 2026
ఆదిలాబాద్: మే 20న భారీ జాబ్ మేళా.. 7వేల కొలువులు!

ఆదిలాబాద్ జిల్లాలోని నిరుద్యోగ యువత కోసం మే 20న భారీ జాబ్ మేళా నిర్వహించనున్నట్లు కలెక్టర్ రాజర్షిషా ప్రకటించారు. ఈ మేళా ద్వారా సుమారు 5,000 నుంచి 7,000 వరకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని వెల్లడించారు. ప్రారంభంలో వేతనాలు తక్కువగా ఉన్నా, కష్టపడితే భవిష్యత్తు బాగుంటుందని యువతకు సూచించారు. అర్హులైన నిరుద్యోగులు ఈ సువర్ణ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.