News October 14, 2024
ఆదిలాబాద్ MP నేటి పర్యటన ఇలా..

ఆదిలాబాద్ ఎంపీ గొడం నగేష్ నేడు (సోమవారం) సిర్పూర్ నియోజకవర్గంలో పర్యటించనున్నారు. వివరాలు ఇలా.. కాగజ్నగర్ పట్టణ పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో ఉదయం 10 గంటలకు నిర్వహించనున్న అలాయ్- బలాయ్ కార్యక్రమంలో పాల్గొంటారు. 11 గంటలకు దహెగాం ప్రెస్క్లబ్ మొదటి వార్షికోత్సవానికి హాజరవుతారు. అనంతరం మధ్యాహ్నం 2 గంటలకు బెజ్జూర్ మండల కేంద్రంలో, 4 గంటలకు ఈస్గాంలో బీజేపీ సభ్యత్వ నమోదుపై కార్యకర్తల సమావేశంలో పాల్గొంటారు.
Similar News
News December 9, 2025
ఆదిలాబాద్: ‘అన్నా నమస్తే.. ఊరికొస్తున్నావా’

ఆదిలాబాద్ జిల్లాలో తొలి విడతలో 166 పంచాయతీలకు ఎన్నికలు జరగనున్నాయి. ఈక్రమంలో ఎన్నికలకు మరో ఒక్క రోజే గడువు ఉండడంతో అందుబాటులో లేని స్థానిక ఓటర్లకు అభ్యర్థులు పదేపదే కాల్స్ చేస్తున్నారు. చాలా మంది రాజధాని పరిధిలోని HYD,రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాలకు వివిధ పనుల నిమిత్తం వెళ్లారు. వారికి కాల్ చేసి ‘అన్నా నమస్తే.. ఊరికొస్తున్నావ్ కదా.. నాకే ఓటేయాలి’ అంటూ ఆన్లైన్లో డబ్బులు చెల్లిస్తున్నారని సమాచారం.
News December 9, 2025
ఆదిలాబాద్: ఈరోజు సాయంత్రం నుంచి మైకులు బంద్

ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ, సిరికొండ, గాదిగూడ, ఇంద్రవెల్లి, ఉట్నూరు, నార్నూరు మండలాల్లోని 166 పంచాయతీలకు మొదటి విడతలో భాగంగా 11వ తేదీన ఎన్నికలు జరగనున్నాయి. ప్రచారం గడువు నేటి సాయంత్రంతో ముగియనుంది. దీంతో అభ్యర్థులు, వారి బంధువులు గ్రామంలోని ఇంటింటికీ తిరుగుతూ తమకు ఓటు వేసి గెలిపించాలని కోరుతున్నారు. ఎక్కడా సమయం వృథా చేయకుండా ప్రతి ఓటరును కలుస్తూ క్షేత్రస్థాయిలో ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు.
News December 8, 2025
మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ పకడ్బందీగా అమలు: ADB కలెక్టర్

మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ పకడ్బందీగా అమలు చేయాలని కలెక్టర్ రాజర్షి షా అధికారులను ఆదేశించారు. సోమవారం ఆదిలాబాద్ జెడ్పి సమావేశ మందిరంలో మూడవ విడత గ్రామపంచాయతీ ఎన్నికల స్టేజ్- 2 రిటర్నింగ్ అధికారులకు నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఎన్నికల సిబ్బంది పోస్టల్ బ్యాలెట్, ఉప సర్పంచ్ ఎన్నిక నిర్వహణ పూర్తి చేసి ఫలితాలు T -పోల్ పోర్టల్లో నమోదు చేయాలన్నారు.


