News June 5, 2024

ఆదిలాబాద్: MP ఫలితం.. 20 ఏళ్ల చరిత్ర తిరగరాసింది

image

20 ఏళ్ల నుంచి ఆదిలాబాద్ ఓటర్లు ఏ పార్టీకి రెండు సార్లు వరుసగా విజయాలు ఇవ్వలేదు. ప్రస్తుతం సిట్టింగ్ ఎంపీ బీజేపీదే కావడం.. తాజా పార్లమెంట్ ఎన్నికల్లో గెలిచి 20ఏళ్ల చరిత్రను తిరగరాసింది. ఇదే కాకుండా 2018 అసెంబ్లీ ఎన్నికల తర్వాత BJPలో చేరిన సోయం ఎంపీగా గెలిచారు. ఇప్పుడు గొడం నగేశ్ సైతం బీఆర్ఎస్ నుంచి బీజేపీలో చేరి MPగా పోటీలో నిలిచారు. అలాగే పార్టీలో చేరిన వెంటనే గెలిచిన అభ్యర్థిగా నగేశ్ నిలిచారు.

Similar News

News November 5, 2024

బెల్లంపల్లి: ‘రాజకీయ అండతోనే భూకబ్జాకు ప్రయత్నం’

image

బెల్లంపల్లి పట్టణం స్థానిక రైల్వే స్టేషన్ ఎదురుగా ఉన్న శ్రీ సంజీవని హనుమాన్ దేవాలయ భూములను పరిరక్షించాలని విశ్వహిందూ పరిషత్, బజరంగ్దళ్ సభ్యులు డిమాండ్ చేశారు. జిల్లా అధ్యక్షుడు రేవల్లి రాజలింగు మాట్లాడుతూ.. దేవాలయ భూముల కబ్జాకు దౌర్జన్యంగా రాజకీయ అండతోనే కబ్జాకు పాల్పడుతున్నారని ఆరోపించారు. భూముల కబ్జాకు ప్రయత్నిస్తున్న దుండగులపై కేసు నమోదు చేసి చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని కోరారు.

News November 5, 2024

మానవత్వం చాటుకున్న బెల్లంపల్లి ఆటో డ్రైవర్

image

మంచిర్యాల నుంచి బెల్లంపల్లి వైపు వెళ్తున్న ఆటోలో గోదావరిఖనికి చెందిన ప్రయాణికుడు మందమర్రిలో ఆటో దిగి బ్యాగ్ మర్చిపోయాడు.బెల్లంపల్లికి చేరుకున్న ఆటో డ్రైవర్ తిరుపతి విషయాన్ని బెల్లంపల్లి ఆటో యూనియన్ అధ్యక్షుడు కట్టరాం కుమార్ కి సమాచారం అందించారు. అయిన ద్వారా బ్యాగుని బాధితుడికి అప్పచెప్పారు. బ్యాగ్‌లో విలువైన బ్యాంక్ పత్రాలు, కొత్త బట్టలు ఉన్నట్లు బాధితుడు తెలిపారు.

News November 4, 2024

ఆదిలాబాద్: ఇద్దరు సోయాబీన్ దొంగలు అరెస్ట్

image

ఆదిలాబాద్ మార్కెట్ యార్డులో సోయాబీన్ దొంగలించిన కేసులు ఇద్దరిని అరెస్టు చేసి రిమాండ్ కు తరలించినట్లు టూటౌన్ సీఐ కరుణాకర్ తెలిపారు. గత నెల 30న మార్కెట్ యార్డ్‌లో దొంగతనం అయినట్లు సీఈవో కేదార్ పండరి ఫిర్యాదు చేశారన్నారు. దర్యాప్తులో భాగంగా స్థానిక వడ్డెర కాలనీకి చెందిన ఎ.రాజు, ఎస్.రాజు సోయాబీన్ 50 కేజీలు దొంగతనం చేసినట్లు గుర్తించి అరెస్టు చేసినట్లు తెలిపారు. సోయాబీన్ స్వాధీనం చేసుకున్నామన్నారు.