News October 17, 2024

ఆదిలాబాద్: OPEN అడ్మిషన్లకు గడువు పొడగింపు

image

DR.BR అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీలో డిగ్రీ, పీజీ కోర్సులో ప్రవేశాలకు గడువును ఈ నెల 30 వరకు పొడిగిస్తున్నట్లు ఆదిలాబాద్ సైన్స్ కళాశాల ప్రిన్సిపల్ డా.సంగీత పేర్కొన్నారు. 2022–23, 2023-24లో డిగ్రీలో చేరిన 2nd, 3rd ఇయర్ చదువుతున్న విద్యార్థులు కూడా ట్యూషన్ ఫీజును చెల్లించాలని, సకాలంలో ఫీజు చెల్లించని వారు 30 తేదీలోపు చెల్లించొచ్చని తెలిపారు. ఉమ్మడి జిల్లా విద్యార్థులు ఈ విషయాన్ని గమనించాలన్నారు.

Similar News

News December 11, 2025

ఆదిలాబాద్‌ జిల్లాలో 10.67% పోలింగ్ నమోదు

image

ఆదిలాబాద్ జిల్లాలో తొలి విడత గ్రామపంచాయతీ ఎన్నికల్లో ఉదయం 9 గంటల వరకు 10.67 శాతం సరాసరి ఓటింగ్ నమోదైందని జిల్లా పంచాయతీ అధికారి రమేశ్ తెలిపారు. మండలాల వారీగా పోలింగ్ శాతం వివరాలు ఇలా ఉన్నాయి. ఇచ్చోడలె 9.7%, సిరికొండ 20.87%, ఇంద్రవెల్లి 6.17%, ఉట్నూర్ 10.56%, నార్నూర్ 11.99%, గాదిగూడలో 14.29% నమోదైంది. ఓటర్లు చురుగ్గా పాల్గొంటున్నారు.

News December 11, 2025

ఆదిలాబాద్: గ్రామాల్లో ఉత్కంఠ.. ఓటేసేందుకు రెడీనా?

image

జిల్లాలో తొలివిడతలో 6 మం. పంచాయతీ ఎన్నికలు జరగనున్నాయి. ఇంద్రవెల్లి(29), నార్నూర్(24), ఉట్నూర్(38), సిరికొండ(18) గాదిగూడ(25), ఇచ్చోడ(33) మండలాల్లో ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1గంట వరకు పోలింగ్ జరగనుంది. మొత్తం 167 గ్రామాలు ఉన్నాయి. ఎలాంటి ఘటనలను జరగకుండా భద్రత ఏర్పాట్లు చేశారు. మ. 2గంటల నుంచి ఫలితాలు వెల్లడికానున్నాయి.
> GP ఎన్నికల అప్‌డేట్స్ కోసం Way2Newsను ఫాలో అవ్వండి

News December 11, 2025

నిర్భయంగా ఓటేయండి: ఆదిలాబాద్ ఎస్పీ

image

ఇప్పటివరకు 38 గ్రామాలలో ఫ్లాగ్ మార్చ్‌లు నిర్వహించి ప్రజలను ఓటు హక్కుపై అవగాహన కల్పించామని ఆదిలాబాద్ ఎస్పీ అఖిల్ మహాజన్ తెలిపారు. నిర్భయంగా ఓటు హక్కును వినియోగించుకోవాలని, ప్రలోభాలకు గురి కాకూడదని తెలిపారు. గొడవలకు అల్లర్లకు దారి తీయకుండా ప్రశాంతంగా ఓటు హక్కును వినియోగించుకొని ఇళ్లకు చేరుకోవాలని సూచించారు. ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు పూర్తయ్యేలా ప్రజలు అందరు సహకరించాలని కోరారు.