News June 25, 2024

ఆదిలాబాద్: PM విశ్వకర్మ యోజన పథకానికి 6061 దరఖాస్తులు

image

PM విశ్వకర్మ యోజనపై జిల్లాస్థాయి కమిటీ సమావేశం సోమవారం కలెక్టర్ రాజర్షి షా ఆధ్వర్యంలో జిల్లా కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో నిర్వహించారు. ఈ సమావేశంలో పరిశ్రమల జనరల్ మేనేజర్ పద్మభూషణ్ విశ్వకర్మ యోజన గురించి వివరించారు. ఇప్పటి వరకు జిల్లాలో 6061 దరఖాస్తులు చేసుకున్నారని అందులో 1820 దరఖాస్తుల పరిశీలన పూర్తయిందని తెలిపారు. కాగా మిగతా 4241 దరఖాస్తులను త్వరగా పరిశీలించాలని కలెక్టర్ ఆదేశించారు.

Similar News

News July 11, 2025

ఆదిలాబాద్‌లో నేడే జాబ్‌మేళా

image

ADB తెలంగాణ గిరిజన సంక్షేమ బాలుర జూనియర్ కళాశాలలో ఈనెల 11న HCL Technologies ఆధ్వర్యంలో ఉదయం 9 గంటలకు నిర్వహించనున్న జాబ్‌మేళాను సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ రాజర్షి షా కోరారు. 2024-25 సంవత్సరంలో MPC, MEC, CEC/BIPC, Vocational Computersలో ఇంటర్ పూర్తి చేసిన విద్యార్థులు అర్హులన్నారు. మరిన్ని వివరాలకు 8074065803, 7981834205 నంబర్లను సంప్రదించాలని సూచించారు.

News July 10, 2025

ADB అదనపు కలెక్టర్‌కు ఐద్వా సర్వే రిపోర్ట్

image

అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం (ఐద్వా) ఆధ్వర్యంలో జిల్లాలో నెలకొన్న సమస్యలపై వారం రోజులుగా సర్వే నిర్వహించారు. గురువారం సర్వే రిపోర్టును ఆదిలాబాద్ అదనపు కలెక్టర్ శ్యామలాదేవికి అందజేశారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో, పాఠశాలల్లో, రిమ్స్‌లో మౌలిక వసతులు కల్పించాలన్నారు. బెల్ట్ షాపులను తొలగించాలని, కల్తీ కల్లును అరికట్టేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు. నాయకులు మంజుల, జమున తదితరులున్నారు.

News July 10, 2025

సమష్టి కృషితో బాలకార్మిక వ్యవస్థ నిర్మూలన: ADB SP

image

బాలలు బడులకు వెళ్లే విధంగా ప్రోత్సహించాలని, పిల్లలు కార్మికులుగా ఉండరాదని ఎస్పీ అఖిల్ మహాజన్ సూచించారు. ఆపరేషన్ ముస్కాన్‌పై వివిధ శాఖల అధికారులతో ఆదిలాబాద్‌లో సమావేశం నిర్వహించారు. ఆపరేషన్ ముస్కాన్ ప్రారంభమైన పది రోజుల వ్యవధిలో 37 మంది బాలల సంరక్షణ తోపాటు జిల్లావ్యాప్తంగా 10 కేసుల నమోదు చేసినట్లు పేర్కొన్నారు. అందరి సమష్టి కృషితో బాలకార్మిక వ్యవస్థను నిర్మూలిద్దామని పిలుపునిచ్చారు.