News August 4, 2024

ఆదిలాబాద్ : REPORT చేయడానికి రేపే LAST

image

ప్రభుత్వ, ప్రైవేటు ఐటీఐలో రెండో విడత ప్రవేశాలకు సంబంధించి రిపోర్టింగ్ గడువును పొడిగించినట్లు ఆదిలాబాద్ ప్రభుత్వ ఐటీఐ ప్రిన్సిపల్ శ్రీనివాస్ ఓ ప్రకటనలో తెలిపారు. ఐటీఐ రెండో విడతలో ప్రవేశాలు పొంది, ఇప్పటివరకు రిపోర్ట్ చేయని విద్యార్థులకు అడ్మిషన్ రిపోర్టింగ్ తేదీని ఆగస్టు 5వరకు పొడిగించినట్లు తెలిపారు. రెండో విడతలో సీటు పొందిన అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

Similar News

News November 4, 2025

ఆదిలాబాద్‌లో నేటి పత్తి ధర వివరాలు

image

ఆదిలాబాద్ మార్కెట్ యార్డులో పత్తి కొనుగోళ్లు సజావుగా సాగుతున్నాయి. మార్కెట్‌లో మంగళవారం సీసీఐ పత్తి ధర క్వింటా రూ.8,110గా, ప్రైవేట్ పత్తి ధర రూ.6,900గా నిర్ణయించారు. సోమవారం ధరతో పోలిస్తే మంగళవారం సీసీఐ ధరలో ఎలాంటి మార్పు లేదు. ప్రైవేటు ధరలో సైతం ఎటువంటి మార్పు లేదని వ్యవసాయ మార్కెట్ కమిటీ అధికారులు తెలిపారు.

News November 4, 2025

ADB: బీసీ నేతను పరామర్శించిన కవిత

image

తలమడుగు మండల బీసీ సంఘం అధ్యక్షుడు మేకల రవికాంత్ యాదవ్ ఇటీవల రోడ్డు ప్రమాదంలో గాయపడ్డారు. జిల్లా కేంద్రంలోని ఆయన నివాసంలో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత పరామర్శించారు. ప్రమాదానికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.

News November 4, 2025

భీంపూర్ మండలంలో పులి సంచారం కలకలం..!

image

గత కొన్ని రోజులుగా భీంపూర్ మండలంలో పులి సంచారం కలకలం రేపుతోంది. తాజాగా సోమవారం అంతర్గాం గ్రామస్థుల వ్యవసాయ పొలాల్లో పులి అడుగులు కనిపించాయని రైతులు తెలిపారు. దీంతో సమీప గ్రామాల ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. ఈ ఘటనకు సంబంధించి అటవీ అధికారులు వివరాలు వెల్లడించాల్సి ఉంది.