News November 11, 2024
ఆదిలాబాద్: TUTC రాష్ట్ర కార్యవర్గం ఇదే..!
తెలంగాణ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్(TUTF) రాష్ట్ర నూతన కార్యవర్గాన్ని మహాసభల అనంతరం ఎన్నుకున్నారు. గౌరవ అధ్యక్షుడిగా ఏ.మురళీమోహన్ రెడ్డి, అధ్యక్షుడిగా తుమ్మల లచ్చిరాం, కార్యనిర్వాహక అధ్యక్షుడిగా దామెర శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శిగా పి.రఘునందన్ రెడ్డి, ఆడిట్ కమిటీ కన్వీనర్ గా గోపాల్ ఎన్నికయ్యారు. వీరికి ఉపాధ్యాయులు శుభాకాంక్షలు తెలిపి సన్మానించారు. ఉపాధ్యాయ, విద్యారంగ సమస్యలను పరిష్కరిస్తామన్నారు.
Similar News
News December 3, 2024
MNCL: పెళ్లైనా నాలుగు నెలలకే వివాహిత ఆత్మహత్య
పెళ్ళైన నాలుగు నెలలకే వివాహిత ఆత్మహత్య చేసుకున్న సంఘటన మంచిర్యాల జిల్లా కేంద్రంలో విషాదాన్ని నింపింది. స్థానిక ఏసీసీలోని కృష్ణ కాలనీకి చెందిన అయిండ్ల రోషిణి కడుపు నొప్పి భరించలేక ఇవాళ ఉదయం తల్లిగారింటి వద్ద మూడో అంతస్తుపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది. మృతురాలికి గత ఆగస్టులో వివాహం జరిగింది. తండ్రి శ్రీనివాస్ జిల్లా కలెక్టర్ డ్రైవర్ గా పనిచేస్తున్నాడు. ఎస్సై రాములు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
News December 3, 2024
ఆదిలాబాద్ జిల్లాకు నూతనంగా ఐదు 108 అంబులెన్సులు
ప్రజాపాలన విజయోత్సవాల్లో భాగంగా నిర్వహించిన ఆరోగ్య దినోత్సవ కార్యక్రమంలో ఆదిలాబాద్ జిల్లాకు నూతనంగా ఐదు 108 అంబులెన్స్ లను ప్రభుత్వం కేటాయించింది. ప్రజా పాలన విజయోత్సవాల భాగంగా రాష్ట్రవ్యాప్తంగా కేటాయించిన అంబులెన్స్ లను సీఎం రేవంత్ రెడ్డి, రాష్ట్ర మంత్రులతో కలిసి హైదరాబాద్‌లో ప్రారంభించారు. ఈ ఐదు అంబులెన్స్లను ఉట్నూర్, ఇంద్రవెల్లి, గాదిగూడ, ఇచ్చోడ, తాంసి మండలాలకు అధికారులు కేటాయించారు.
News December 2, 2024
నృత్య ప్రదర్శనలో నిర్మల్ చిన్నారుల ప్రతిభ
నిర్మల్ జిల్లా శ్రీ బాసర జ్ఞాన సరస్వతి ఆలయంలో కార్తీక మాసాన్ని పురస్కరించుకుని కూచిపూడి నృత్య ప్రదర్శన నిర్వహించారు. కార్యక్రమంలో నిర్మల్‌కు చెందిన చిన్నారులు ప్రతిభ కనబరిచి ప్రశంసా పత్రాలను పొందారు. ఈ సందర్భంగా చిన్నారులను పలువురు అభినందించారు. భవిష్యత్తులో మరిన్ని ప్రదర్శనలు ఇచ్చి ఉన్నత స్థానాలకు ఎదగాలని కోరారు.