News January 24, 2025
ఆదివారం మాంసం దుకాణాలు బంద్: జీవీఎంసీ

గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఆదివారం జీవీఎంసీ కమిషనర్ ఆదేశాలు మేరకు విశాఖలో మాంసం అమ్మకాలు పూర్తిగా నిషేధించినట్లు అధికారులు తెలిపారు. దీనికి ప్రతి ఒక్కరు సహకరించాలని కోరుతూ దువ్వాడ, మంగళపాలెం, నరవ ప్రాంతాల్లో దుకాణ యజమానులకు జీవీఎంసీ అధికారులు నోటీసులు అందజేశారు. ఈ ఆదేశాలను అతిక్రమించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని వారు తెలిపారు.
Similar News
News February 11, 2025
విశాఖలో దివ్యాంగ పిల్లల్ని గుర్తించేందుకు సర్వే

విశాఖ జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆద్వర్యంలో ఇంటింటికి వెళ్లి దివ్యాంగ పిల్లల్ని గుర్తించే కార్యక్రమం సోమవారం దండు బజార్ నుంచి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జిల్లా న్యాయ సేవాదికార సంస్థ కార్యదర్శి వెంకటశేషమ్మ పాల్గొన్నారు. ఈనెల 24వరకు ఈ కార్యక్రమం జరుగుతుందన్నారు. అంగ వైకల్యం ఉన్న పిల్లలకు వైద్యం అందిస్తే చిన్నతనంలోనే మామూలు స్థితికి వచ్చే అవకాశం ఉంటుందన్నారు.
News February 10, 2025
స్టీల్ ప్లాంట్‌లో ప్రమాదం.. కార్మికుడికి గాయాలు

విశాఖ స్టీల్ ప్లాంట్‌లో సోమవారం రాత్రి ప్రమాదం చోటుచేసుకుంది. స్టీల్ ప్లాంట్ బ్యాటరీ-2లో లిడ్ ఓపెన్ నుంచి మంటలు వ్యాపించడంతో నాగ శ్రీనివాసరావు అనే కార్మికుడు గాయాల పాలయ్యాడు. తోటి కార్మికులు వెంటనే ఆసుపత్రి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
News February 10, 2025
వైసీపీ ముఖ్య నేతలతో గుడివాడ సమావేశం

విశాఖ వైసీపీ ఆఫీసులో ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్నాథ్ ఆధ్వర్యంలో సోమవారం ముఖ్య నేతల సమావేశం నిర్వహించారు. ఇందులో భాగంగా విశాఖ జిల్లాలో ఇటీవల నియమించిన అనుబంధ సంఘాల అధ్యక్షులతో పలు విషయాలపై చర్చించారు. పార్టీ అభివృద్ధికి కృషి చేయాలని సూచించారు. ఈ సమావేశంలో మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేశ్, ఉత్తర నియోజకవర్గ సమన్వయకర్త కెకె రాజు, రమణికుమారి ఉన్నారు.