News June 14, 2024
ఆదివారం రాష్ట్రస్థాయి ఆర్చరీ పోటీలకు ఎంపికలు
శ్రీకాకుళం నగరం అరసవల్లి కన్నయ్య కాలనీలోని ఆదిత్య ఆర్చరీ అకాడమీలో ఆదివారం రాష్ట్రస్థాయి ఆర్చరీ జట్టు క్రీడాకారులను ఎంపిక చేయనున్నట్లు సంఘం జిల్లా అధ్యక్షుడు చిట్టిబాబు శుక్రవారం తెలిపారు. అండర్ 15 బాల, బాలికల విభాగంలో నిర్వహించనున్న ఈ ఎంపికలకు ఆసక్తి, అర్హత కలిగిన క్రీడాకారులు ఆధార్ కార్డు, పుట్టిన తేదీ ధ్రువపత్రం, ఫొటోలతో పాటు రూ.300 ప్రవేశ రుసుము చెల్లించాల్సి ఉంటుందన్నారు.
Similar News
News September 15, 2024
LHMS సేవను ప్రజలు వినియోగించుకోవాలి: SP
జిల్లా ప్రజలు ఎవరైనా తమ ఇంటికి తాళాలు వేసి ఊరికి వెళ్లేటప్పుడు మీ ఇంటి భద్రత కోసం జిల్లా పొలీసు వారి వద్దనున్న లాక్డ్ హౌస్ మానిటరింగ్ సిస్టం అనే టెక్నాలజీని వినియోగించుకోవాలని SP మహేశ్వరరెడ్డి ఒక ప్రకటనలో కోరారు. ఈ సేవ పూర్తిగా ఉచితమన్నారు. ప్రజలు తమ మొబైల్ ఫోన్లో గూగుల్ ప్లే స్టోర్స్ లో ఉన్న ” LHMS AP Police” యాప్ ను డౌన్లోడ్ చేసి మీ వివరాలను ఫిల్ చేయాలన్నారు. తద్వారా సేవలు అందుతాయన్నారు.
News September 15, 2024
SKLM: ఇక మండలానికి ఒక్క MEO ఉండనున్నారా..?
వైసీపీ ప్రభుత్వ హయాంలో మండలానికి ఇద్దరు ఎంఈఓలు విధానానికి తాజాగా కూటమి ప్రభుత్వం స్వస్తి పలకనుందనే సంకేతాలు కనిపిస్తాయి.. ఇక ఒక్క ఎంఈఓతోనే మండల విద్యాశాఖను పర్యవేక్షణ చేపట్టనున్నట్లు తెలుస్తుంది. ఇందులో భాగంగా ప్రభుత్వం స్కూల్ కాంప్లెక్స్‌లను పటిష్ఠం చేయనుంది. జిల్లాలోని శ్రీకాకుళం,టెక్కలి,పలాస డివిజన్ల పరిధిలోని 38 మండలాల్లో ఇక ఒక్కరే ఎంఈఓ ఉండనున్నారు అనే సమాచారం జిల్లా అధికారులకు చేరింది.
News September 15, 2024
నరసన్నపేట: మద్యం సీసాలో బొద్దింక
మద్యం సీసాలో బొద్దింకని చూసి మందుబాబు నివ్వెరపోయాడు. కోమర్తి గ్రామానికి చెందిన అప్పన్న నరసన్నపేట బండివీధి సమీపంలో ఓ ప్రభుత్వ దుకాణంలో ఈ నెల 12న మద్యంసీసా కొనుగోలు చేశాడు. అనంతరం పరిశీలించగా అందులో బొద్దింక కనిపించింది. ఈ విషయం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది. ఎక్సైజ్ సీఐ లక్ష్మి వద్ద ప్రస్తావించగా తమ శాఖ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తే, వారి ఆదేశాల మేరకు చర్యలు తీసుకుంటామన్నారు.