News August 7, 2024

ఆదివాసి దినోత్సవం జరిగే ప్రదేశాన్ని పరిశీలించిన కలెక్టర్

image

గుమ్మలక్ష్మీపురంలో ఈ నెల 9వ తేదీన జరిగే ప్రపంచ ఆదివాసి దినోత్సవం ప్రదేశాన్ని, ఏర్పాట్లను కలెక్టర్ శ్యాంప్రసాద్, ఎమ్మెల్యే జగదీశ్వరి మంగళవారం పరిశీలించారు. ఈ వేడుకలకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు వచ్చే అవకాశం ఉన్నందున మండలంలో అనువైన పలు ప్రాంతాలను పరిశీలిస్తున్నారు. కలెక్టర్ వెంట జేసీ శోభిక తదితర సిబ్బంది ఉన్నారు.

Similar News

News September 21, 2024

మహాకవి గురజాడ జయంతి నేడు

image

నవయుగ వైతాళికుడు, మహాకవిగా పేరు గాంచిన గురజాడ వెంకట అప్పారావు జయంతి విజయనగరంలో శనివారం జరగనుంది. 1862 సెప్టెంబర్ 21న విశాఖ జిల్లా సర్వసిద్ధి రాయవరంలో ఆయన జన్మించారు. తండ్రి వెంకట రామదాసు విజయనగరం సంస్థానంలో పెష్కారుగా పనిచేసే సమయంలో అప్పారావు చీపురుపల్లిలో చదువుకున్నారు. తండ్రి చనిపోయిన తరువాత విజయనగరం వచ్చి ఉన్నత విద్యను పూర్తి చేశారు. 20వ శతాబ్దంలో వ్యవహారిక భాషోద్యమంలో ఆయన పోరాడారు. SHARE IT..

News September 21, 2024

VZM: ‘ఈనెల 30 నుంచి సమ్మెలోకి వెళ్తున్నాం’

image

ప్రభుత్వ సంస్థల్లో పని చేస్తున్న పారిశుద్ధ్య కార్మికులు, సెక్యూరిటీ గార్డులు, సూపర్వైజర్ల సమస్యల పరిష్కారం కోసం ఈ నెల 30 నుంచి సమ్మెలోకి వెళ్తున్నట్లు ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి బుగత అశోక్ తెలిపారు. ఈ మేరకు విజయనగరం డిప్యూటీ కమిషనర్ ఆఫ్ లేబర్ ను శుక్రవారం తన కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి సమ్మె నోటీసు అందజేశారు. తక్షణమే కార్మికుల సమస్యలను పరిష్కరించాలని కోరారు.

News September 20, 2024

VZM: గురజాడ జయంతికి సర్వం సిద్ధం

image

విజయనగరంలో శనివారం నిర్వహించనున్న మహా కవి శ్రీ గురజాడ అప్పారావు జయంతి ఉత్సవాలకు సర్వం సిద్ధమైంది. గురజాడ స్వగృహంతో పాటు ఆయన విగ్రహం వద్ద విద్యుత్ దీపాల అలంకరణను అధికారులు పూర్తి చేశారు. ఈ నేపథ్యంలో గురజాడ నివాసం విద్యుత్ అలంకరణలో దేదీప్యమానంగా దర్శనమిస్తోంది. కలెక్టర్ అంబేద్కర్ ఆధ్వర్యంలో శనివారం ప్రత్యేక కార్యక్రమాలు జరుగనున్నాయి.