News August 8, 2024
ఆదివాసి దినోత్సవ వేడుకలకి చీఫ్ గెస్ట్‌గా చంద్రబాబు
విజయవాడ తమ్మలపల్లి కళాక్షేత్రంలో శుక్రవారం నిర్వహించనున్న ప్రపంచ ఆదివాసి దినోత్సవ వేడుక ఏర్పాట్లను గిరిజన కార్పొరేషన్ ఎండీ నవ్య గురువారం పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఈ వేడుకలకు ముఖ్యఅతిథిగా సీఎం చంద్రబాబు రానున్నారని చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా వేలాది మంది ఆదివాసీలు హాజరుకానున్నట్లు టీడీపీ నేత మాదిగాని గురునాథం తెలిపారు.
Similar News
News September 11, 2024
విజయవాడలో ‘ఉరుకు పటేల’ చిత్ర యూనిట్ సందడి
‘ఉరుకు పటేల’ చిత్ర యూనిట్ విజయవాడలో సందడి చేసింది. ఈ నెల 7న చిత్రం విడుదలై థియేటర్‌లలో విజయవంతంగా నడుస్తోందని ఆ సినిమా హీరోహీరోయిన్లు తేజస్ కంచర్ల, కుష్బూ చౌదరి తెలిపారు. మూవీ విజయోత్సవం సందర్భంగా విజయవాడ వచ్చిన యూనిట్ నగరంలో ఏర్పాటు చేసిన భారీ గణనాథుడిని మంగళవారం రాత్రి దర్శించుకొని పూజలు చేశారు. తమ చిత్రం వినాయకచవితి రోజున విడుదల అయ్యిందని, ఆ గణపయ్య ఆశీస్సులతో మంచి సక్సెస్ సాధించిందన్నారు.
News September 11, 2024
విజయవాడ: పాడైన విద్యుత్ మీటర్ల స్థానంలో కొత్తవి..
విజయవాడలో వరదల కారణంగా విద్యుత్ శాఖకు కూడా బాగానే నష్టం జరిగింది. గ్రౌండ్ ఫ్లోర్, సెల్లర్లో ఉన్న విద్యుత్ మీటర్లు వరద నీటికి పాడయ్యాయి. పాడైన మీటర్ల స్థానంలో తాత్కాలికంగా కొత్త మీటర్లు ఏర్పాటు చేయాలని విద్యుత్ అధికారులు నిర్ణయించారు. ఇప్పటికే 35 వేల మీటర్లను సిద్ధంగా ఉంచినట్లు సమాచారం. నేటి నుంచి మీటర్లు పాడైన స్థానంలో కొత్త మీటర్లను ఉచితంగా ఏర్పాటు చేయనున్నారు.
News September 11, 2024
డీజేలకు నో పర్మిషన్: మచిలీపట్నం డీఎస్పీ
వినాయక నిమజ్జన ఊరేగింపులో DJలకు అనుమతి లేదని మచిలీపట్నం డీఎస్పీ అబ్దుల్ సుభాన్ తెలిపారు. స్థానిక సిరి కళ్యాణ మండపంలో వినాయక ఉత్సవ కమిటీ సభ్యులతో సమావేశమైన ఆయన.. నిమజ్జనం రోజు తీసుకోవల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించారు. మద్యం తాగి నిమజ్జన ఊరేగింపుల్లో పాల్గొన్నా, ఎక్కడైనా అల్లర్లకు పాల్పడినా కమిటీ వారిపై చర్యలు తీసుకోవాల్సి ఉంటుందన్నారు. అందరూ సహకరించి, పండగను ప్రశాంతంగా పూర్తి చేసుకోవాలన్నారు.