News August 8, 2024

ఆదివాసీ దినోత్సవాన్ని విజయవంతం చేయాలి: కలెక్టర్

image

ఈనెల 9వ తేదీన ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ శివ శంకర్ లోతేటి గురువారం తెలిపారు. ఆదివాసీ దినోత్సవం శుక్రవారం ఉదయం 10.30 గంటలకు కలెక్టరేట్‌లోని ప్రజా సమస్యల పరిష్కార వేదిక సమావేశ మందిరంలో నిర్వహించడం జరుగుతుందని, జిల్లాలోని ప్రజలు ప్రతి ఒక్కరూ పాల్గొని విజయవంతం చేయాలన్నారు.

Similar News

News May 8, 2025

పెండ్లిమర్రిలో రోడ్డు ప్రమాదం.. మృతులు వీరే

image

పెండ్లిమర్రి మండలంలోని కొత్తూరు వద్ద గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి చెందిన విషయం తెలిసిందే. మృతులను వేంపల్లి శ్రీరాంనగర్‌కు చెందిన బాలయ్య, రాజీవ్ నగర్‌కు చెందిన మల్లికార్జున, మదనపల్లెకి చెందిన మల్లికార్జునగా స్థానికులు గుర్తించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

News May 8, 2025

పెండ్లిమర్రిలో ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురి మృతి

image

పెండ్లిమర్రి మండలం కొత్తూరు వద్ద గురువారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ముగ్గురు దుర్మరణం చెందారు. బైక్‌ను కంటైనర్ ఢీకొనడంతో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందగా, తీవ్రంగా గాయపడిన మరొకరు వేంపల్లి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

News May 8, 2025

కడప: రిమ్స్ ప్రిన్సిపల్‌గా డాక్టర్ జమున

image

కడప రిమ్స్ మెడికల్ కళాశాల నూతన ప్రిన్సిపల్‌గా డాక్టర్ జమున గురువారం బాధ్యతలు స్వీకరించారు. ఉదయం కళాశాల సిబ్బంది ఆమెకు ఘనంగా స్వాగతం పలికి బొకేలు అందజేశారు. రిమ్స్ మెడికల్ కళాశాల అభివృద్ధికి కృషి చేస్తానని ఆమె అన్నారు. రోగులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూసుకుంటానని పేర్కొన్నారు.