News August 9, 2024
ఆదివాసుల హక్కుల కోసం పోరాడిన మహిళ సుగుణ: సీతక్క
ఆదివాసి హక్కుల కోసం పోరాడిన మహిళ ఆత్రం సుగుణ అని రాష్ట్ర మంత్రి సీతక్క అన్నారు. ప్రపంచ ఆదివాసి దినోత్సవం సందర్భంగా హైదరాబాదులో నిర్వహించిన కార్యక్రమంలో ఆత్రం సుగుణను మంత్రి సీతక్క మెమొంటో ఇచ్చి సన్మానించారు. ఆదివాసుల హక్కుల కోసం అనేక సందర్భాలలో సుగుణ పోరాటాలు నిర్వహించాలన్నారు. అంతకుముందు సుగుణ ఆదివాసి దినోత్సవంలో పాల్గొని మన్యం వీరుడు కొమరం భీం విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.
Similar News
News September 13, 2024
ఆదిలాబాద్: రూ.818కే విద్యుత్ మీటర్
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని పేదవారికి తక్కువ ధరకే ప్రభుత్వం విద్యుత్ మీటర్లు అందించనున్నట్లు అధికారులు తెలిపారు. ఇంట్లో విద్యుత్ కనెక్షన్ లేనివారు ఈ నెల 15 వరకు నూతన మీటర్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. 500 వాట్స్‌కి రూ.938, 250 వాట్స్‌కి రూ.818 చెల్లించాల్సి ఉంటుంది. విద్యుత్ కార్యాలయాలు, ఉపకేంద్రాల్లో దరఖాస్తు చేసుకుంటే చాలు.
News September 13, 2024
నిర్మల్ : సీజనల్ వ్యాధుల నియంత్రణకు పటిష్ఠ చర్యలు చేపట్టాలి: కలెక్టర్
సీజనల్ వ్యాధుల నియంత్రణకు పటిష్ట చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టర్ కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సీజనల్ వ్యాధుల నియంత్రణకు తీసుకోవలసిన చర్యలపై మండలాల వారీగా వైద్య ఆరోగ్య, పంచాయతీరాజ్ శాఖల అధికారులతో ఆమె సమీక్షించారు. సీజనల్ వ్యాధుల నియంత్రణకు పటిష్ఠ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. వైద్యారోగ్యశాఖ పనితీరును మరింతగా పటిష్టపర్చలన్నారు.
News September 12, 2024
జైనూర్ బాధితురాలిని పరామర్శించిన బీఎస్పీ ఎంపీ
జైనూర్‌లో ఇటీవల ఆదివాసీ మహిళపై అత్యాచారం జరగగా బాధితురాలు సికింద్రాబాద్ గాంధీ హాస్పిటల్‌లో చికిత్స పొందుతోంది. కాగా బాధితురాలిని ఆదిలాబాద్ బీఎస్పీ పార్లమెంట్ ఇన్‌ఛార్జ్ జంగు బాబుతో కలిసి బీఎస్పీ రాజ్యసభ ఎంపీ రాంజీ గౌతమ్ పరామర్శించారు. బాధిత కుటుంబానికి రూ.25లక్షల ఎక్స్‌గ్రేషియా, డబుల్ బెడ్ రూమ్ ఇల్లు, కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.