News May 2, 2024
ఆదోనిలో స్వల్పంగా తగ్గిన పత్తి ధర
ఆదోని వ్యవసాయ మార్కెట్ యార్డులో గురువారం పత్తి క్వింటా గరిష్ఠ ధర రూ.7,587 పలికింది. మంగళవారంతో పోలిస్తే ధర స్వల్పంగా తగ్గింది. ప్రస్తుతం మార్కెట్‌లో క్వింటా పత్తి కనిష్ఠ ధర రూ.4,711, వేరుశనగ గరిష్ఠ ధర రూ.7,311, కనిష్ఠ ధర రూ.3,819 పలికింది. ఆముదాలు గరిష్ఠ ధర రూ.5,400, కనిష్ఠ ధర రూ.4,400 పలికినట్లు మార్కెట్ అధికారులు తెలిపారు.
Similar News
News November 12, 2024
BIG NEWS: యురేనియం తవ్వకాల నిలిపివేతకు ఆదేశాలు
కర్నూలు జిల్లా దేవనకొండ మండలంలో యురేనియం తవ్వకాలపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. యురేనియం తవ్వకాలను తక్షణమే ఆపేయాలని సీఎం చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు. ప్రజల ఆందోళనల దృష్ట్యా ఇప్పటికే తవ్వకాలు నిలిపివేసినట్లు అధికారులు చెప్పారు. కాగా, ప్రజలు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కర్నూలు జిల్లా కలెక్టర్ రంజిత్ బాషా స్పష్టం చేశారు.
News November 12, 2024
సంక్షేమ వసతి గృహాలను పరిశుభ్రంగా ఉంచండి- కలెక్టర్
నంద్యాల జిల్లాలోని 86 ప్రభుత్వ సంక్షేమ వసతి గృహాలను పరిశుభ్రంగా ఉంచుకోవడంతో పాటు పిల్లలకు వ్యక్తిగత పరిశుభ్రతపై అవగాహన కల్పించాలని కలెక్టర్ రాజకుమారి అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్లోని పిజిఆర్ఎస్ హాలులో వసతి గృహాల సంక్షేమ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. మౌలిక వసతుల ఏర్పాటుపై వ్యక్తిగత శ్రద్ధ తీసుకోవాలని వెల్ఫేర్ సూచించారు. విద్యార్థులకు మెరుగైన వసతి సౌకర్యాలు కల్పించాలన్నారు.
News November 12, 2024
రహదారి నిర్మాణ పనులు త్వరగా పూర్తి చేయాలి: కలెక్టర్ రాజకుమారి
నంద్యాల: పల్లె పండుగ – పంచాయతీ వారోత్సవాలలో శంకుస్థాపన చేసిన రోడ్ల నిర్మాణ పనులు శరవేగంగా పూర్తి చేసేందుకు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని కలెక్టర్ జి.రాజకుమారి అధికారులను ఆదేశించారు. పంచాయతీరాజ్ ఇంజనీర్లు, ఇంజనీరింగ్ అసిస్టెంట్లతో కలెక్టరేట్‌లో ఆమె సమీక్షా సమావేశం నిర్వహించారు. దాదాపు రూ.86 కోట్లతో జిల్లాలో 1023 సీసీ రోడ్లు, 3 బీటీ రోడ్ల నిర్మాణాలు చేపడుతున్నట్లు పేర్కొన్నారు.