News March 11, 2025
ఆదోని పోలీసుల కస్టడీ పిటిషన్ డిస్మిస్

సినీ నటుడు పోసాని కృష్ణమురళిపై ఆదోని పోలీసులు వేసిన కస్టడీ పిటిషన్ను కర్నూలు మొదటి అదనపు జుడీషియల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ (జేఎఫ్సీఎం) అపర్ణ డిస్మిస్ చేశారు. మరోవైపు బెయిల్ పిటిషన్పై ఇరువైపులా వాదనలు ముగియడంతో తీర్పును రిజర్వు చేశారు. నేడు వెల్లడించే అవకాశం ఉంది. చంద్రబాబు, పవన్పై అనుచిత వ్యాఖ్యలు చేశారని జనసేన నేత ఫిర్యాదుతో గతేడాది ఆదోని పీఎస్లో పోసానిపై కేసు నమోదైంది.
Similar News
News November 23, 2025
మంత్రుల వాట్సాప్ గ్రూపులు హ్యాక్

తెలంగాణ మంత్రులు, పలు శాఖల అధికారిక వాట్సాప్ గ్రూపులు హ్యాక్ అయ్యాయి. SBI ఆధార్ అప్డేట్ పేరుతో ప్రమాదకర APK ఫైల్స్ షేర్ అయ్యాయి. ఆ ఫైల్స్ను ఓపెన్ చేయవద్దని పోలీసులు సూచిస్తున్నారు. అప్పటికే ఓపెన్ చేసిన పలువురు జర్నలిస్టులు.. తమ ఫోన్లు హ్యాక్ అయినట్లు ఫిర్యాదులు చేస్తున్నారు.
News November 23, 2025
వరి, పత్తి పంటల్లో బోరాన్ లోపం ఇలా గుర్తించండి

☛ వరి: బోరాన్ లోపం వల్ల వరి లేత ఆకుల చివర్లో తెల్లగా మారి వంకర్లు తిరుగుతాయి. వరి పొట్ట దశ నుంచి ఈత దశలో పుప్పొడి ఉత్పత్తి తగ్గి గింజ గట్టిపడక కుదురులోని అన్ని పిలకలు తాలుగా మారతాయి. ☛ పత్తి: లేత చిగుర్లు చిగురించవు. మొగ్గల పెరుగుదల ఆగిపోయి పక్కల నుంచి మొగ్గలు వస్తాయి. లేత ఆకుల చివర్లు, లేత మొగ్గలు దళసరిగా మారి, కుళ్లుతున్నట్లు కనిపిస్తాయి. కాయలపై పగుళ్లు ఏర్పడతాయి.
News November 23, 2025
విశాఖ: కాంగ్రెస్ పార్టీ మహిళా అధ్యక్షురాలిగా గాయత్రి

కాంగ్రెస్ పార్టీ మహిళా విభాగం విశాఖ జిల్లా అధ్యక్షురాలిగా కాండవ గాయత్రి ఎంపికయ్యారు. ఈ సందర్భంగా డీసీసీ అధ్యక్షులు అడ్డాల వెంకటవర్మ నియామకపత్రం అందజేశారు. పార్టీ బలోపేతానికి తన వంతు కృషి చేస్తానని ఆమె అన్నారు. జిల్లా కమిటీ నియమకం పూర్తిచేస్తున్నట్లు ఆయన తెలిపారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ పోటీ చేస్తుందని అన్నారు.


