News March 20, 2025
ఆదోని మున్సిపల్ ఛైర్ పర్సన్ శాంత నిరసన

ఆదోని మున్సిపల్ ఛైర్ పర్సన్ శాంత గురువారం నిరసన చేపట్టారు. పట్టణంలోని కోట్ల విగ్రహం వద్ద నిరాహార దీక్షకు పూనుక్కున్నారు. ఏ తప్పు చేయకున్నా అవిశ్వాస తీర్మానం పెట్టాలని కౌన్సిలర్లు కలెక్టర్‌కు ఫిర్యాదు చేయడం తగదన్నారు. నాలుగేళ్ల పాటు నిజాయితీగా ఉంటూ వైసీపీలోనే కొనసాగుతున్నన్నారు. ఆ పార్టీ కౌన్సిలర్లే పదవి దింపాలని చూడటం సమంజసం కాదని అన్నారు. న్యాయం చేయాలని మాజీ సీఎం జగన్‌ను కోరుతామని తెలిపారు.
Similar News
News November 30, 2025
20 ప్రముఖ కంపెనీల్లో ఉద్యోగాలు: మంత్రి భరత్

కర్నూల్ కేవీఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో వచ్చే నెల 8న జాబ్ మేళా నిర్వహించనున్నట్లు మంత్రి టీజీ భరత్ తెలిపారు. పదో తరగతి నుంచి డిగ్రీ వరకు చదివిన నిరుద్యోగులు (18-35 ఏళ్లు) జాబ్ మేళాలో పాల్గొనవచ్చన్నారు. 20 కంటే ఎక్కువ ప్రముఖ కంపెనీల ప్రతినిధులు హాజరవుతారని స్కిల్ అభివృద్ధి అధికారి ఆనంద్ రాజ్ కుమార్ తెలిపారు. అనంతరం జాబ్ మేళాకు సంబంధించిన కరపత్రాలను శనివారం విడుదల చేశారు.
News November 30, 2025
రూ.105.66 కోట్లతో రోడ్ల నిర్మాణం: కర్నూలు కలెక్టర్

కర్నూలు జిల్లాలో పాడైన రహదారుల అభివృద్ధికి ప్రభుత్వం రోడ్లు-భవనాల శాఖ ద్వారా రూ.105.66 కోట్లు మంజూరు చేసిందని కలెక్టర్ డా.ఏ.సిరి తెలిపారు. మొత్తం 222.18 కి.మీ పొడవుతో 30 రోడ్ల పనులు చేపట్టనున్నట్లు చెప్పారు. ఢనాపురం-హొళగుంద రోడ్‌కు రూ.13.70 కోట్లు, బైచిగేరి-పెద్దకడుబూరు రోడ్‌కు రూ.6.40 కోట్లు, ఎమ్మిగనూరు-మాలపల్లి-కోసిగి రోడ్‌కు రూ.7.40 కోట్లు కేటాయించిందని వెల్లడించారు.