News August 15, 2024
ఆదోని: మేము అధికార పార్టీలో ఉన్నామా..?: మీనాక్షి నాయుడు
కూటమి ప్రభుత్వం ఏర్పడిందని, ఆదోనిలో బీజేపీ అభ్యర్థి కోసం నాయకులు, కార్యకర్తలు కష్టపడి పనిచేసి గెలిపించుకున్నామని, అయినా తాము అధికార పార్టీలో ఉన్నామా? అన్న సందేహం కలుగుతోందని మాజీ ఎమ్మెల్యే మీనాక్షి నాయుడు అన్నారు. బీజేపీ ఎమ్మెల్యే వ్యవహార శైలి వల్ల తమ పార్టీ నాయకులు, కార్యకర్తలు తీవ్ర ఇబ్బంది పడుతున్నారన్నారు. తమ నాయకులను ఇబ్బంది పెట్టిన వారిని బీజేపీలో చేర్చుకోవడం ఏంటని అసహనం వ్యక్తంచేశారు.
Similar News
News January 15, 2025
జాతీయ స్థాయి మహిళా కబడ్డీ పోటీలు ప్రారంభం
నంద్యాల జిల్లా పగిడ్యాల మండలం తూర్పు ప్రాతకోటలో వెలసిన నాగేశ్వరస్వామి సంక్రాంతి తిరుణాళ్ల సందర్భంగా జాతీయ స్థాయి మహిళా కబడ్డీ పోటీలు మంగళవారం ప్రారంభమయ్యాయి. ఈ పోటీలను హైకోర్టు న్యాయమూర్తి ఎన్.హరినాథ్ రెడ్డి ప్రారంభించారు. కార్యక్రమంలో సర్పంచ్ పిట్టల శేషమ్మ, ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన 12 మహిళా జట్లు పాల్గొన్నాయి.
News January 14, 2025
కర్నూలు: కన్ను తెరిచిన పార్వతీ దేవి..!
కర్నూలు మండలం గార్గేయపురం గొల్ల వీధిలోని అతి పురాతన బావిలో ఉన్న శివాలయం నందు పార్వతీ దేవి విగ్రహం కన్ను తెరిచారనే ప్రచారం వైరలవుతోంది. ఈ విషయం తెలిసిన జనాలు పక్క ఊర్ల నుంచి తండోపతండాలుగా అమ్మవారి దర్శనార్థం తరలి వస్తున్నారు. ప్రస్తుతం అక్కడ భక్తుల రద్దీ ఎక్కువగా ఉండటం వల్ల తాలూకా పోలీసులు చేరుకుని భద్రతా చర్యలు చేపట్టారు. భక్తులు తోసుకోకుండా అమ్మవారిని చూసేందుకు ఒక్కొక్కరిని పంపుతున్నారు.
News January 14, 2025
నంద్యాల: లాడ్జిలో సాఫ్ట్వేర్ ఇంజినీర్ సూసైడ్
నంద్యాల జిల్లా కొలిమిగుండ్ల మండలం ఉమ్మాయిపల్లెకు చెందిన శివరాఘవ రెడ్డి(22) సూసైడ్ చేసుకున్నాడు. శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరంలోని పీఆర్టీ సర్కిల్ వద్ద గల కృష్ణ లాడ్జిలో అద్దెకు తీసుకున్న రూమ్లో ఫ్యాన్కు ఉరివేసుకున్నాడు. మృతుడు బెంగళూరులో ఒక ప్రైవేట్ కంపెనీలో సాఫ్ట్వేర్ ఇంజినీర్గా ఉద్యోగం చేస్తున్నాడు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.