News October 10, 2024
ఆదోని: రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

ఆదోని మండలం సాదాపురం క్రాస్ ఇండియన్ పెట్రోల్ బంక్ దగ్గర గుర్తుతెలియని వాహనం ఢీకొని అంజి(48) మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. కొంతకాలంగా పెట్రోల్ బంక్లో జీవనం సాగిస్తున్నాడు. వేకువజామున టీ తాగడానికి రోడ్డు దాటుతుండగా గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో కోమాలోకి వెళ్లాడు. స్థానికులు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న బంధువులు మెరుగైన చికిత్స కోసం కర్నూలు తరలిస్తుండగా మృతి చెందాడు.
Similar News
News November 22, 2025
ఏపీ కుర్ని కార్పొరేషన్ రాష్ట్ర ఛైర్మన్గా ఎమ్మిగనూరు నేత

కూటమి ప్రభుత్వం మరో 11 కార్పొరేషన్లకు ఛైర్మన్లను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఎమ్మిగనూరుకు చెందిన టీడీపీ నేత మిన్నప్పకు కుర్ని కార్పొరేషన్ రాష్ట్ర ఛైర్మన్ పదవి కట్టబెట్టింది. మిన్నప్ప మాట్లాడుతూ.. ఎమ్మెల్యే డాక్టర్ బీవీ జయనాగేశ్వర రెడ్డి ఆశీర్వాదంతో తనకు ఈ పదవి దక్కిందన్నారు. బీవీకి, సీఎం చంద్రబాబుకు ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
News November 22, 2025
సత్యసాయి బాబా శతజయంతి వేడుకలు ఘనంగా నిర్వహించండి: కలెక్టర్

పుట్టపర్తి సత్యసాయి బాబా శత జయంతి వేడుకలను జిల్లాలో ఘనంగా నిర్వహించేందుకు అధికారులు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ డా. ఏ.సిరి ఆదేశించారు. ఈనెల 23 రాష్ట్రస్థాయి కార్యక్రమంగా జరుపుతున్న నేపథ్యంలో ప్రతీ మండలంలో జయంతి ఉత్సవాలు జరగాలని సూచించారు. సత్యసాయి బాబా బోధనలు, సేవా తత్వం యువతకు ప్రేరణ కాబోతున్నందున యువత పెద్దఎత్తున పాల్గొనేలా చూడాలని కలెక్టర్ ఆదేశించారు.
News November 22, 2025
కలెక్టర్ సిరి హెచ్చరిక

డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ కింద రోగులకు మెరుగైన వైద్య సేవలందించాలని, రోగుల నుంచి డబ్బు వసూలు చేస్తే చర్యలు తప్పవని కలెక్టర్ డా.ఏ.సిరి నెట్వర్క్ ఆసుపత్రి యాజమాన్యాలను హెచ్చరించారు. శుక్రవారం కర్నూలు కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఎన్టీఆర్ వైద్య సేవకు సంబంధించి ప్రైవేట్ నెట్వర్క్ ఆసుపత్రుల యాజమాన్యాలతో సమీక్ష నిర్వహించారు. ఫిర్యాదులు అందితే ఆస్పత్రులపై చర్యలు తీసుకుంటామన్నారు.


