News October 10, 2024
ఆదోని: రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి
ఆదోని మండలం సాదాపురం క్రాస్ ఇండియన్ పెట్రోల్ బంక్ దగ్గర గుర్తుతెలియని వాహనం ఢీకొని అంజి(48) మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. కొంతకాలంగా పెట్రోల్ బంక్‌లో జీవనం సాగిస్తున్నాడు. వేకువజామున టీ తాగడానికి రోడ్డు దాటుతుండగా గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో కోమాలోకి వెళ్లాడు. స్థానికులు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న బంధువులు మెరుగైన చికిత్స కోసం కర్నూలు తరలిస్తుండగా మృతి చెందాడు.
Similar News
News November 8, 2024
సీప్లేన్‌లో శ్రీశైలానికి సీఎం చంద్రబాబు
సీఎం చంద్రబాబు నాయుడు రేపు శ్రీశైలం రానున్నారు. మధ్యాహ్నం 12 గంటలకు ప్రకాశం బ్యారేజ్ నుంచి సీప్లేన్‌లో బయలుదేరుతారు. 12.40 గంటలకు శ్రీశైలంలోని ఫ్లోటింగ్ జెట్టీ వద్దకు చేరుకుంటారు. 1 నుంచి 1.25 గంటల వరకు స్వామి, అమ్మవార్లను దర్శించుకుంటారు. తర్వాత్ ప్రెస్‌మీట్ నిర్వహిస్తారు. అనంతరం మళ్లీ సీప్లేన్‌లోనే విజయవాడకు వెళ్తారు. సీఎం పర్యటన నేపథ్యంలో జిల్లా అధికారులు ఏర్పాట్లను పూర్తి చేశారు.
News November 8, 2024
అపార్‌పై నిర్లక్ష్యం తగదు: కర్నూలు కలెక్టర్
విద్యార్థులకు అపార్ ఐడీ జనరేట్ చేయడంలో నిర్లక్ష్యం వహిస్తున్నారని, ఇదే కొనసాగితే ఉపేక్షించేది లేదని కలెక్టర్ రంజిత్ బాషా పేర్కొన్నారు. గురువారం విద్యాశాఖ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. అపార్ నమోదు కేవం 56% మాత్రమే అయిందన్నారు. నిర్లక్ష్యం వహిస్తున్నారని, సాంకేతిక సమస్యలను పరిష్కరించుకుని వేగవంతం చేయాలన్నారు. వారంలోపు 70% మించి నమోదవ్వాలని, అనంతరం సమీక్ష నిర్వహిస్తానని స్పష్టం చేశారు.
News November 8, 2024
కేసులకు భయపడేది లేదు: ఎమ్మెల్సీ ఇసాక్ బాషా
తనపై ఎన్ని తప్పుడు కేసులు బనాయించినా భయపడేది లేదని, ధైర్యంగా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నానని నంద్యాల జిల్లాకు చెందిన ఎమ్మెల్సీ ఇసాక్ బాషా పేర్కొన్నారు. తనపై వన్ టౌన్ స్టేషన్‌లో కేసు నమోదైన నేపథ్యంలో గురువారం విలేకరులతో ఆయన మాట్లాడారు. న్యాయం కోసం పోరాటం చేస్తానని అన్నారు. తాను చేపట్టిన అపార్ట్‌మెంట్ పనులకు ప్రభుత్వం అనుమతులు మంజూరు చేసిందని స్పష్టం చేశారు.