News January 31, 2025
ఆదోని: రోడ్డు భద్రతపై సబ్ కలెక్టర్ సమీక్ష

ఆదోని సబ్ కలెక్టరేట్లో రోడ్డు భద్రత సమీక్షా సమావేశం గురువారం సబ్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్ ఆధ్వర్యంలో వివిధ శాఖల అధికారులతో నిర్వహించారు. ప్రమాదాలు జరగకుండా సీసీ కెమెరాలు, స్పీడ్ బ్రేకర్లు, లైట్లు వేయించటం, ముఖ్యమైన సర్కిల్లో పబ్లిక్ అడ్రస్ సిస్టం ఏర్పాటు చేయటం, మొదలగు అంశాలపై చర్చించారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ హేమలత, ఆర్టీవో నాగేంద్ర, మోటర్ వెహికల్ ఇన్స్పెక్టర్ శిశిర దీప్తి పాల్గొన్నారు.
Similar News
News November 24, 2025
లింగ సమానత్వానికి కృషి చేయాలి: కర్నూలు కలెక్టర్

సమాజంలో లింగ సమానత్వ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని జిల్లా కలెక్టర్ సిరి సూచించారు. సోమవారం కలెక్టరేట్ సునయన ఆడిటోరియంలో “జెండర్ సమానత్వం” జాతీయ ప్రచార పోస్టర్ను కలెక్టర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. నవంబర్ 25 నుంచి డిసెంబర్ 23 వరకు దేశవ్యాప్తంగా “నయీ చేతన 4.0 –మార్పు కోసం ముందడుగు” పేరుతో జెండర్ వివక్షతకు వ్యతిరేకంగా ప్రచారం నిర్వహించనున్నట్టు తెలిపారు.
News November 24, 2025
ఇళ్లు లేనివారు ఈనెల 30లోగా ఇలా చేయండి: కర్నూలు కలెక్టర్

PMAY–2 గ్రామీణ్ కింద అర్హతకలిగి, ఇల్లులేని గ్రామీణ ప్రజలు నవంబర్ 30లోపు తమపేర్లు నమోదు చేసుకోవాలని జిల్లా కలెక్టర్ డా.సిరి సూచించారు. గ్రామాల్లో ఇంటి స్థలం ఉన్నా– లేకపోయినా సచివాలయంలోని ఇంజినీరింగ్ అసిస్టెంట్ ద్వారా నమోదు చేయవచ్చని తెలిపారు. ఇల్లు మంజూరు అయ్యేవారికి ప్రభుత్వం రూ.1.80 లక్షలు అందజేస్తుందని పేర్కొన్నారు. గడువు తర్వాత నమోదు అవకాశంలేదని, అర్హులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలన్నారు.
News November 24, 2025
అర్జీలు స్వీకరించిన కర్నూలు కలెక్టర్

కర్నూలు కలెక్టరేట్లోని సునయన ఆడిటోరియంలో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం జరిగింది. జిల్లా కలెక్టర్ ఏ. సిరి వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల సమస్యలను నేరుగా స్వీకరించారు. ప్రతి అర్జీని క్షుణ్ణంగా పరిశీలించి, నిర్ణీత సమయంలో సమస్యలను పరిష్కరించాలని కలెక్టర్ అధికారులను ఈ సందర్భంగా ఆదేశించారు.


