News July 9, 2024
ఆదోని: విద్యుత్ షాక్తో బాలుడికి తీవ్రగాయాలు

విద్యుత్ షాక్కు గురై బాలుడు తీవ్రంగా గాయపడిన ఘటన మంగళవారం జరిగింది. ఆదోని(M) ఇస్వీ గ్రామానికి చెందిన ఈరమ్మ, బసవరాజు కుమారుడు హుసేని అంగన్వాడీ స్కూల్కి వెళ్లాడు. ఆడుకోవడానికి బయటికొచ్చిన బాలుడికి సమీపంలోనే ఉన్న ట్రాన్స్ఫార్మర్కి ఉన్న విద్యుత్ తీగ తగలడంతో తీవ్రగాయాలయ్యాయి. అదే సమయంలో అదృష్టవశాత్తు కరెంట్ పోవడంతో ప్రాణాలతో బయటపడ్డాడు. బాలుడిని ఆదోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
Similar News
News November 22, 2025
సత్యసాయి బాబా శతజయంతి వేడుకలు ఘనంగా నిర్వహించండి: కలెక్టర్

పుట్టపర్తి సత్యసాయి బాబా శత జయంతి వేడుకలను జిల్లాలో ఘనంగా నిర్వహించేందుకు అధికారులు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ డా. ఏ.సిరి ఆదేశించారు. ఈనెల 23 రాష్ట్రస్థాయి కార్యక్రమంగా జరుపుతున్న నేపథ్యంలో ప్రతీ మండలంలో జయంతి ఉత్సవాలు జరగాలని సూచించారు. సత్యసాయి బాబా బోధనలు, సేవా తత్వం యువతకు ప్రేరణ కాబోతున్నందున యువత పెద్దఎత్తున పాల్గొనేలా చూడాలని కలెక్టర్ ఆదేశించారు.
News November 22, 2025
కలెక్టర్ సిరి హెచ్చరిక

డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ కింద రోగులకు మెరుగైన వైద్య సేవలందించాలని, రోగుల నుంచి డబ్బు వసూలు చేస్తే చర్యలు తప్పవని కలెక్టర్ డా.ఏ.సిరి నెట్వర్క్ ఆసుపత్రి యాజమాన్యాలను హెచ్చరించారు. శుక్రవారం కర్నూలు కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఎన్టీఆర్ వైద్య సేవకు సంబంధించి ప్రైవేట్ నెట్వర్క్ ఆసుపత్రుల యాజమాన్యాలతో సమీక్ష నిర్వహించారు. ఫిర్యాదులు అందితే ఆస్పత్రులపై చర్యలు తీసుకుంటామన్నారు.
News November 22, 2025
కె.నాగలాపురం పోలీస్ స్టేషన్లో ఎస్పీ వార్షిక తనిఖీ

కె.నాగలాపురం పోలీసు స్టేషన్ను ఎస్పీ విక్రాంత్ పాటిల్ తనిఖీ చేసి, రికార్డులను పరిశీలించారు. పెండింగ్ కేసులు, నిందితుల అరెస్టులు, దర్యాప్తుల పురోగతిపై వివరాలు తెలుసుకున్నారు. రోడ్డు ప్రమాదాల నివారణ చర్యలు చేపట్టాలని, డ్రంక్ అండ్ డ్రైవ్, ఓపెన్ డ్రింకింగ్పై ప్రత్యేక తనిఖీలు నిర్వహించి, శిక్షలు విధించాలని సూచించారు. ప్రాపర్టీ కేసులను ఛేదించి, రికవరీలు చేయాలని ఆదేశించారు.


