News March 23, 2024
ఆదోని సబ్ కలెక్టర్ వాహనాన్ని ఢీకొన్న బైక్.. వ్యక్తి మృతి
అదోని మండలం విరూపాపురం గ్రామానికి చెందిన పింజరి కాశీం అనే వ్యక్తి చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందాడు. గత నెల 26వ ఆదోని సబ్ కలెక్టర్ శివ నారాయణశర్మ వాహనాన్ని కాశీం బైక్ వేగంగా ఢీకొనడంతో తీవ్రంగా గాయపడ్డాడు. చికిత్స నిమిత్తం కర్నూలు ఆసుపత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందాడు. విషయం తెలుసుకున్న అధికారులు నివాళులు అర్పించి వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు.
Similar News
News January 3, 2025
టమాటా రైతులకు కాస్త ఊరట
పత్తికొండ టమాటా మార్కెట్లో టమాటా ధరలు కొంత మేర పుంజుకుంటున్నాయి. మొన్నటి వరకు 25కిలోల బాక్సు కేవలం రూ.30కి మాత్రమే అమ్ముడయ్యాయి. కూలీల ఖర్చులు కూడా రావడంలేదని రైతులు ఆవేదన వ్యక్తం చేయగా నిన్న కొంత మేర ధర పెరగడంతో ఊరట చెందారు. కిలో గరిష్ఠంగా రూ.18 పలికింది. సరాసరి రూ.15, కనిష్ఠ ధర రూ.10తో క్రయ విక్రయాలు సాగాయి. నిన్న మార్కెట్కు 180 క్వింటాళ్ల టమాటా వచ్చింది.
News January 3, 2025
డాక్టర్లూ మీరు గ్రేట్ ❤
కర్నూలు జిల్లా వెల్దుర్తి మం. కలుగొట్ల గ్రామ ప్రజలకు ఆ ఊరికి చెందిన నలుగురు డాక్టర్లు ఉచిత వైద్యం అందిస్తున్నారు. చంద్రశేఖర్, జాన్ పాల్, మద్దమ్మ, కృష్ణ అనే వైద్యులు గురువారం గ్రామంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. షుగర్, బీపీ, తదితర టెస్టులు చేసి ఫ్రీగా మందులు అందించారు. పుట్టిన ఊరికి ఏదైనా చేయాలనే సంకల్పంతో సొంత ఖర్చుతో వైద్య శిబిరం నిర్వహించామని వారు తెలిపారు. గ్రామ ప్రజలు హర్షం వ్యక్తం చేశారు.
News January 3, 2025
కర్నూలు జిల్లాకు సంబంధించిన క్యాబినెట్ నిర్ణయాలు.!
ఏపీ సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన గురువారం మంత్రివర్గ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఉమ్మడి కర్నూలు జిల్లాకు సంబంధించి తీసుకున్న పలు కీలక నిర్ణయాలకు ఆమోదం లభించింది. కర్నూలు, నంద్యాల జిల్లాల్లో పవన, సౌర విద్యుత్ ప్లాంట్ల ఏర్పాటుతో పాటు రాష్ట్రంలోని నదులన్నింటినీ గోదావరి నుంచి బాణాకచర్లకు అనుసంధానిస్తూ క్యాబినెట్ ఆమోదం తెలిపింది.