News January 8, 2025

ఆదోని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో భారీ అవినీతి.. ఐదుగురు అరెస్టు

image

అక్రమ రిజిస్ట్రేషన్ కేసులో ఆదోని సబ్ రిజిస్ట్రార్ ఆఫీసు సీనియర్ అసిస్టెంట్ ఈరన్న, జూ.అసిస్టెంట్ రమేశ్, డాక్యుమెంట్ రైటర్లు మహబూబ్, షబ్బీర్, సాక్షి ఇలియాస్‌ను పోలీసులు మంగళవారం అరెస్ట్ చేశారు. ఈ మేరకు టూ టౌన్ సీఐ సూర్య మనోహర్ రావు వివరాలను వెల్లడించారు. నిందితులను కోర్టులో హాజరుపరచగా, న్యాయమూర్తి రిమాండ్ విధించారన్నారు. వారిని సబ్ జైలుకు తరలించామని, ప్రధాన నిందితుల కోసం గాలిస్తున్నామని తెలిపారు.

Similar News

News December 7, 2025

ప్రశాంతంగా ఎన్ఎంఎమ్ఎస్ పరీక్షలు: డీఈఓ

image

భారత ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహించిన నేషనల్ మీన్స్ కం మెరిట్ స్కాలర్షిప్ పరీక్ష ఆదివారం జిల్లా వ్యాప్తంగా ప్రశాంతంగా ముగిసింది. కర్నూలులోని బి.క్యాంప్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలను సందర్శించి పరీక్ష జరుగుతున్న తీరును డీఈవో శామ్యూల్ పాల్ పరిశీలించారు. 4,124 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా, 3,960 మంది పరీక్షకు హాజరయ్యారని తెలిపారు. 164 మంది విద్యార్థులు గైర్హాజరు అయినట్లు పేర్కొన్నారు.

News December 7, 2025

నేర ప్రవృత్తికి స్వస్తి పలికి సత్ప్రవర్తనతో జీవించాలి: ఎస్పీ

image

జిల్లాలోని అన్ని పోలీస్ స్టేషన్లలో రౌడీ షీటర్లు, నేరచరిత్ర గలవారికి కౌన్సెలింగ్ నిర్వహించినట్లు ఎస్పీ విక్రాంత్ పాటిల్ తెలిపారు. నేర ప్రవృత్తికి స్వస్తి పలికి సత్ప్రవర్తనతో జీవించాలని, చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు దూరంగా ఉండాలని పోలీసు అధికారులు సూచించారు. చట్టవిరుద్ధ కార్యకలాపాల్లో పాల్గొంటే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. కార్యక్రమం ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఆదేశాల మేరకు చేపట్టారు.

News December 7, 2025

నంద్యాల: పెళ్లి అయిన నెలకే యువకుడి సూసైడ్

image

అనంత(D) యాడికి మండలం నగరూరుకు చెందిన శరత్‌కుమార్‌(25) కొలిమిగుండ్ల జగనన్న కాలనీలో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. శుక్రవారం రాత్రి తన మిత్రుడు హరీశ్ ఇంటికి వచ్చిన శరత్.. శనివారం హరీశ్ డ్యూటీకి వెళ్లిన తర్వాత విషగుళికలు మింగాడు. అపస్మారకస్థితిలో ఉన్న అతన్ని అనంతపురం తరలించగా చికిత్స పొందుతూ మృతిచెందాడు. శరత్ గత నెలలో బళ్లారిలో వివాహం చేసుకుని, బెంగళూరులో ప్రైవేట్ జాబ్‌లో చేరాడు. పోలీసులు కేసు నమోదు చేశారు.