News June 4, 2024
ఆధిక్యంలో దూసుకుపోతున్న పవన్ కళ్యాణ్

పిఠాపురం అభ్యర్థి పవన్ కళ్యాణ్ ఆధిక్యం కొనసాగుతోంది. సమీప అభ్యర్థి వంగ గీతపై పవన్ కళ్యాణ్ 4,350 ఓట్ల ఆధిక్యతతో కొనసాగుతున్నారు. పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ ప్రకటించినట్లుగా పవన్ కళ్యాణ్ మెజార్టీ 60,000 దాటే అవకాశాలు నెలకొని ఉన్నాయని రాజకీయ నిపుణులు వివరిస్తున్నారు. సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపు కాకినాడ జేఎన్టీయూ ప్రాంగణంలో కొనసాగుతోంది.
Similar News
News November 20, 2025
మల్లవరం పంచాయతీకి రాష్ట్రంలో ద్వితీయ స్థానం

శానిటేషన్ IVRS కాలింగ్లో చాగల్లు మండలం మల్లవరం పంచాయతీ రాష్ట్రంలోనే ద్వితీయ స్థానం దక్కించుకుంది. ఈ విషయాన్ని ఎంపీడీవో శ్రీదేవి గురువారం ప్రకటించారు. పబ్లిక్ రెస్పాన్స్ సిస్టమ్ ద్వారా ప్రభుత్వం నిర్వహించిన సర్వేలో, ఇంటింటికీ చెత్త సేకరణకు 100 శాతం, కనీసం వారానికి రెండుసార్లు సేకరణకు 92 శాతం మార్కులు సాధించింది. ఈ సందర్భంగా పంచాయతీ కార్యదర్శి కమలావతిని ఎంపీడీవో సన్మానించారు.
News November 19, 2025
ప్రతి 3వ శుక్రవారం ఫిర్యాదులకు అవకాశం: కలెక్టర్

ఉద్యోగుల ఫిర్యాదుల దినోత్సవంలో భాగంగా ప్రతి మూడవ శుక్రవారం ఉద్యోగులు తమ వ్యక్తిగత సమస్యలు సహా అన్ని రకాల ఫిర్యాదులను నేరుగా సమర్పించవచ్చని జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి బుధవారం ప్రకటించారు. అందిన ప్రతి ఫిర్యాదును ప్రత్యేక ఐడీతో పోర్టల్లో నమోదు చేస్తారు. ఈ ప్రత్యేక నంబర్ ద్వారా ఉద్యోగి తన ఫిర్యాదు స్థితిని ఆన్లైన్లో ట్రాక్ చేసుకునే సౌకర్యం కల్పించనున్నట్లు ఆమె తెలిపారు.
News November 19, 2025
నేడు అన్నదాత సుఖీభవ నిధులు జమ: కలెక్టర్

జిల్లాలో అర్హులైన 1,14,991 మంది రైతులకు PM-KISAN 21, అన్నదాత సుఖీభవ–2 పథకాల కింద మొత్తం రూ.7,699.90 లక్షల నిధులు జమ కానున్నాయని జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి తెలిపారు. ఈ మేరకు బుధవారం నిడదవోలులో మంత్రి కందుల దుర్గేశ్ ఆధ్వర్యంలో జిల్లా స్థాయి కార్యక్రమం నిర్వహించడానికి ఏర్పాట్లు చేశారు. ఈ కార్యక్రమాన్ని ఆర్.ఎస్.కే స్థాయి వరకు ప్రత్యక్ష ప్రసారం చేయనున్నారు.


