News January 10, 2026
ఆధునిక సాగుతోనే రైతులకు మేలు: కలెక్టర్

వ్యవసాయంలో సాంకేతిక విజ్ఞానాన్ని అందిపుచ్చుకుని రైతులు మెరుగైన లాభాలు సాధించాలని జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్ల సూచించారు. శనివారం కోవూరులో ఛాంపియన్ ఫార్మర్ శ్రీనివాసులు సాగు చేస్తున్న వరి పొలాన్ని ఆయన పరిశీలించారు. పురుగుల నివారణకు వాడుతున్న సోలార్ లైట్ ట్రాప్స్ పనితీరును అడిగి తెలుసుకున్నారు. ఇలాంటి పద్ధతులను గ్రామంలోని ఇతర రైతులకు కూడా వివరించాలని అధికారులను ఆదేశించారు.
Similar News
News January 19, 2026
నెల్లూరు: నేడు పాఠశాలలు ప్రారంభం

సంక్రాంతి పండుగ సెలవులు ముగియడంతో జిల్లావ్యాప్తంగా నేడు పాఠశాలలు తిరిగి ప్రారంభమయ్యాయి. ఉదయం నుంచే విద్యార్థులతో స్కూల్ ప్రాంగణాలు కిటకిటలాడాయి. ఉపాధ్యాయులు హాజరై తరగతులు నిర్వహించారు. సెలవుల తరువాత మళ్లీ చదువుల వాతావరణం నెలకొనడంతో విద్యార్థుల్లో ఉత్సాహం కనిపించింది. తల్లిదండ్రులు పిల్లలను స్కూళ్లకు పంపుతూ హర్షం వ్యక్తం చేశారు.
News January 19, 2026
నెల్లూరు: 108 వాహనాల్లో పైలెట్ ఉద్యోగాలకు నోటిఫికేషన్

నెల్లూరు జిల్లాలో 108 వాహనాల్లో పైలెట్ ఉద్యోగాలకు దరఖాస్తుల ఆహ్వానిస్తున్నట్లు జిల్లా మేనేజర్ అశోక్ ఆదివారం ఒక ప్రకటన తెలిపారు. పదవ తరగతి ఉత్తీర్ణులై హెవీ డ్రైవింగ్ లైసెన్స్ కలిగిన వారు జనవరి 21, 22వ తేదీలలో తిరుపతి జిల్లా అలిపిరి రోడ్డులోని DMHO కార్యాలయం నందు హాజరుకావాలని సూచించారు.
News January 19, 2026
నెల్లూరు: ఇరిగేషన్లో రూ.100 కోట్లు పక్కదారి!

మొంథా తుఫాను నిధులు పక్కదారి పట్టాయి. జిల్లాకు రూ.100 కోట్లు మంజూరైతే.. పనులు చేయకుండానే బిల్లులు పెట్టేశారు. ఈ వ్యవహారంలో ఓ DAO తన కొడుకు, బంధువుల ఫోన్ పేకి అమౌంట్ ట్రాన్సఫర్ చేయించుకోవడంతో అవినీతి బట్ట బయలైంది. ఈ విషయం రాష్ట్రస్థాయికి చేరడంతో విచారణ అధికారి వచ్చి వెళ్లారు కానీ ఫైళ్లు ముందుకు కదలలేదు. తుఫానుతో చెరువులు కరకట్లు, షట్టర్లు, కాలువల మరమ్మతుల చేపట్టిన దాఖలాలు లేవు.


