News June 12, 2024
ఆనంకు అరుదైన అవకాశం.. నలుగురు సీఎంల దగ్గర ఆరుసార్లు మంత్రి

ఆనం రామనారాయణరెడ్డి ఆరోసారి మంత్రి పదవి దక్కించుకున్నారు. 1983లో నెల్లూరు TDP అభ్యర్థిగా గెలిచి NTR మంత్రివర్గంలో పనిచేశారు. 1985లో రాపూరు నుంచి గెలిచి మరోసారి మంత్రి అయ్యారు. 1991లో కాంగ్రెస్‌లో చేరి 1999, 2004 రాపూరు నుంచి గెలిచారు. 2007లో, 2009లో YSR మంత్రివర్గంలో రెండుసార్లు పనిచేశారు. 2012లో కిరణ్‌కుమార్‌రెడ్డి హయాంలో మంత్రిగా చేశారు. 2024లో చంద్రబాబు మంత్రివర్గంలో చోటు దక్కించుకున్నారు.
Similar News
News December 2, 2025
నెల్లూరు ‘నేర‘జాణలు వీళ్లు.!

నెల్లూరులో ‘నేర‘జాణల హవా ఎక్కువైంది. మొన్నటి వరకు నిడిగుంట అరుణ వ్యవహారం రాష్ట్రాన్ని కుదిపేసింది. తాజాగా పెంచలయ్య హత్యతో అరవ కామాక్షి వెలుగులోకి వచ్చింది. కొందరు యువకులతో గ్యాంగ్ నడిపిస్తూ గంజాయి వ్యాపారం చేస్తోంది. తనకు అడ్డు వచ్చి వారిని ఇదే గ్యాంగ్‌తో బెదిరిస్తోంది. ఈక్రమంలోనే పెంచలయ్యను కామాక్షి హత్య చేయించిందనే ఆరోపణలు ఉన్నాయి. ఇలాంటి లేడీ డాన్లను కఠినంగా శిక్షించాలని పలువురు కోరుతున్నారు.
News December 2, 2025
నేడు నెల్లూరు జిల్లా బంద్

వామపక్ష పార్టీలు, ప్రజాసంఘాల ఆధ్వర్యంలో ఇవాళ నెల్లూరు జిల్లా బంద్ జరగనుంది. పెంచలయ్య దారుణ హత్యకు నిరసనగా ఈ బంద్ నిర్వహిస్తున్నామన్నారు. గంజాయి, మత్తు పదార్థాలను నిషేధించాలని, గంజాయి మాఫియా నుంచి ప్రజలను కాపాడాలని, పెంచలయ్య హత్యకు కారకులైన వారిని శిక్షించాలని జరుగుతున్న బంద్‌కి ప్రజలు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. నిన్న నిందితురాలు కామాక్షికి చెందిన ఇళ్లను స్థానికులు ధ్వంసం చేసిన విషయం తెలిసిందే.
News December 2, 2025
నెల్లూరు: 289 హెక్టార్లలో మునిగిన వరి నాట్లు.!

దిత్వా తుఫాన్‌తో నెల్లూరు జిల్లాలో 289 హెక్టార్లలో వరినాట్లు మునిగి పోయాయి. రబీ సీజన్ ప్రారంభంలో వర్షాలు కురుస్తుండగా పిలక దశలో ఉన్న నాట్లు నీట మునిగాయి. బుచ్చి, కొడవలూరు, కావలి, కోవూరు, సంగం మండలాల పరిధిలో 26 గ్రామాల్లో 81 హెక్టార్లలో నర్సరీ దశ, 208 హెక్టార్లలో వరి పంట నీట మునిగింది. అయితే 333 మంది రైతులు తీవ్రంగా నష్టపోయారని వ్యవసాయశాఖ ప్రాథమిక అంచనాలు రూపొందించింది.


