News August 9, 2024
ఆనం అరుణమ్మ మంత్రుల కలయికలో ఆంతర్యం ఏమిటో?
నెల్లూరు జిల్లా పరిషత్తు ఛైర్ పర్సన్ ఆనం అరుణమ్మ టీడీపీ మంత్రులు పొంగూరు నారాయణ, ఆనం రామనారాయణ రెడ్డిలను వరుసగా కలుస్తుండడంతో పార్టీ మారతున్నారని పలువురు చర్చించుకుంటున్నారు. అరుణమ్మ వైసీపీ మద్దతుతో ZP ఛైర్ పర్సన్ పదవి చేపట్టారు. అయితే జడ్పీ సమావేశాలకు మాత్రమే ఆహ్వానిస్తున్నట్లు ఆమె పేర్కొన్నారు.
Similar News
News September 10, 2024
నాయుడుపేట: సముద్రంలో యువకుని మృతదేహం లభ్యం
వినాయక నిమజ్జనానికి వచ్చి తూపిలిపాలెం సముద్రంలో గల్లంతైన నాయుడుపేటకు చెందిన యువకుడు మునిరాజా (22) మృతదేహం మంగళవారం మధ్యాహ్నం లభ్యమయ్యింది. నిమజ్జనానికి సోమవారం నాయుడుపేట నుంచి వెళ్లిన యువకులలో ఫయాజ్ మృతి చెందిన విషయం తెలిసిందే. అతనికి స్నేహితుడైన ముని రాజా మృతదేహం కూడా మంగళవారం లభ్యమయింది. ప్రాణ స్నేహితులుగా ఉన్న ఇద్దరి మృతితో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
News September 10, 2024
నెల్లూరు జిల్లాలో ర్యాట్ ఫీవర్?
అల్లూరుకు చెందిన వ్యక్తి ర్యాట్ ఫీవర్‌తో బాధపడుతున్నట్లు సమాచారం. అతనికి వైరల్ ఫీవర్ ఎక్కువవ్వడంతో చెన్నైలో వైద్యం చేయించుకున్నారు. ఆదివారం మళ్లీ అనారోగ్యానికి గురవ్వగా నెల్లూరులోని ప్రైవేటు ఆసుపత్రిలో చేరారు. దీనిపై అల్లూరు ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ డా. వెంకటేశ్వరావు వివరణ ఇచ్చారు. ర్యాట్ ఫీవర్ ప్రాణాంతకమని, తాగేనీటిలో ఎలుకలు, పందికొక్కులు మూత్ర విసర్జన చేయడం వలన ఆ వ్యాధి సోకుతుందన్నారు.
News September 10, 2024
నేడు నెల్లూరు, కావలిలో జాబ్ మేళా
యువతకు ఉపాధి కల్పించేందుకు ఈ నెల 10న నెల్లూరు, కావలిలో జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి అధికారి ఎం.వినయ్ కుమార్ తెలిపారు.పది, ఇంటర్, డిగ్రీ, ఐటీఐ, ఉన్నత చదువులు చదివిన వారు అర్హులన్నారు. ఆరోజు ఉదయం 10.30 నుంచి నెల్లూరు దర్గా మిట్టలోని డీకేడబ్ల్యూ మహిళా కళాశాల , కావలి R&B, జిల్లా ఉపాధి, నైపుణ్యాభివృద్ధి కార్యాలయాలో ఇంటర్వ్యూలు నిర్వహిస్తామన్నారు. అభ్యర్థులు ధ్రువపత్రాలతో హాజరుకావాలన్నారు.