News April 3, 2024
ఆనం ఫ్యామిలీకే తక్కువ మెజార్టీ..!

ఆనం సంజీవ రెడ్డి 1958లో కాంగ్రెస్ తరఫున ఆత్మకూరులో పోటీ చేశారు. కేవలం 45 ఓట్ల తేడాతో MLAగా గెలిచారు. జిల్లాలో ఇప్పటి వరకు తక్కువ మెజార్టీ ఆయనదే. 1962లో వి.వెంకురెడ్డి ఇండిపెండెంట్‌గా బరిలో దిగి 86 ఓట్ల మెజార్టీతో MLAగా ఎన్నికయ్యారు. 2009లో నెల్లూరు సిటీలో ముంగమూరు శ్రీధర్ కృష్ణారెడ్డి(PRP) కేవలం 90 ఓట్ల తేడాతో అనిల్ కుమార్ యాదవ్(CONG)పై గెలిచారు. తాజా ఎన్నికల్లో ఈ రికార్డ్ బ్రేక్ అవుతుందా?
Similar News
News February 12, 2026
50 పడకల హాస్టల్ భవనాల పురోగతి ఏంటి? : వేమిరెడ్డి

ధర్తీ ఆబా జన్‌జాతీయ గ్రామ్ ఉత్కర్ష్ అభియాన్ (DAJGUA) పథకం కింద నెల్లూరు జిల్లాలో 50 పడకల హాస్టల్ భవనాన్ని మంజూరు చేసిందా అని ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి లోక్‌సభలో ప్రశ్నించారు. హాస్టల్ నిర్మాణం కోసం మంజూరైన నిధులలో ఎంత ఖర్చు చేశారు?, పూర్తి చేయడానికి పట్టే సమయం ఎంత? వంటి వివరాలు కోరారు. కేంద్రమంత్రి దుర్గా దాస్ ఉయికే నెల్లూరుతో పాటుమొత్తం 31 హాస్టల్స్‌కు రూ.75.3 కోట్లు మంజూరు చేశామన్నారు.
News February 12, 2026
నెల్లూరు: నకిలీ డాక్టర్ అరెస్ట్

వైద్యం పేరుతో నమ్మించి మహిళను మత్తులోకి దించి నగలు దోచుకున్న నకిలీ డాక్టర్‌ను అలిపిరి పోలీసులు గురువారం అరెస్ట్ చేశారు. నెల్లూరుకు చెందిన దేవళ్ల సాయి కృష్ణ (29) జయమ్మ అనే మహిళకు వైద్యం చేస్తానని రూ.1.45 లక్షలు వసూలు చేసి, ఆమె బంధువు మౌనికకు మత్తు మాత్రలు ఇచ్చి 30 గ్రాముల బంగారు గొలుసు అపహరించాడు. నిందితుడు గతంలోనూ ఇలాంటి మోసాలకు పాల్పడి జైలుకు వెళ్లినట్లు అలిపిరి ఎస్ఐ శ్రీవాణి తెలిపారు.
News February 12, 2026
నెల్లూరు: 8 మద్యం దుకాణాలకు నోటిఫికేషన్

నెల్లూరు జిల్లాలో గుర్తించబడిన 8 మద్యం దుకాణాలకు దరఖాస్తుల ఆహ్వానిస్తున్నట్లు జిల్లా ఎక్సైజ్ అండ్ ప్రొహిబిషన్ కార్యాలయం అధికారులు ఒక ప్రకటన విడుదల చేశారు. జలదంకి, బోగోలు, మర్రిపాడు, వింజమూరు, కలిగిరి, ఇందుకూరుపేట, ఆత్మకూరు గ్రామీణ, అనంతసాగరం తదితర 8 మండలాలకు గాను ఈనెల 21వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు దరఖాస్తులు స్వీకరిస్తామన్నారు. 23న కలెక్టరేట్‌లో లాటరీ ప్రక్రియ ద్వారా ఎంపిక చేస్తామన్నారు.


