News March 30, 2024

ఆనాడు ఎన్టీఆర్‌కు.. ఈనాడు కేసీఆర్‌కు వెన్నుపోటు: MLA

image

కడియం శ్రీహరి ఒక అవకాశవాదని, ఆనాడు ఎన్టీఆర్‌కు.. ఈనాడు కేసీఆర్‌కు వెన్నుపోటు పొడిచారని జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి ఆరోపించారు. స్టేషన్ ఘన్పూర్ నియోజకవర్గంలో కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. కడియం ఏనాడూ తెలంగాణ ఉద్యమంలో లేడని, కేసీఆర్‌ను నమ్మి ప్రజలు ఆయన్ను ఎమ్మెల్యేగా గెలిపిస్తే పార్టీకి నమ్మకద్రోహం చేశారని మండిపడ్డారు. ప్రజలు ఆయనకు తగిన బుద్ధి చెప్పాలని కోరారు.

Similar News

News January 14, 2025

ఐనవోలు జాతరలో నూతన ఆర్టీసీ బస్సు ప్రారంభం

image

ఐనవోలు జాతరలో కొత్త ఆర్టీసీ బస్సును వరంగల్ ఆర్టీసీ డిప్యూటీ రీజినల్ మేనేజర్ కే భానుకిరణ్ ప్రారంభించారు. జాతరలోని తాత్కాలిక బస్ పాయింట్ వద్ద మంగళవారం హనుమకొండ డిపో మేనేజర్ భూక్యా ధరంసింగ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఆయన పాల్గొని బస్సును ప్రారంభించారు. మాట్లాడుతూ.. భక్తుల సౌకర్యార్థం కొమురవెల్లి, వరంగల్‌ కు సుమారు 500 ట్రిప్పుల బస్సులను నడుపుతున్నట్లు తెలిపారు.

News January 14, 2025

జనగామ: హత్య కేసులో నిందితుల ARREST

image

హత్య కేసులో నిందితులను అరెస్ట్ చేసినట్లు ASP చేతన్ నితిన్ తెలిపారు. మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు. జనగామలోని ధర్మకంచ వాసి సంపత్, హైదర్, లక్ష్మణ్ స్నేహితులు. వీరికి MHBD వాసి వెంకన్న‌(34)తో ఘర్షణ జరిగింది. ఈ గొడవని మనసులో పెట్టుకుని శనివారం రాత్రి మద్యం తాగించి మత్తులో బండరాయితో మోది, మెడ, తలపై బీర్ బాటిళ్లతో పొడిచి చంపేశారు. కాగా, 24 గంటల్లో నిందితులను పట్టుకున్నట్లు ASP తెలిపారు.

News January 14, 2025

వరంగల్: మీ ముచ్చటైన ముగ్గులు Way2Newsలో

image

సంక్రాంతి, కనుమ సందర్భంగా మీ వాకిట్లో వేసిన మీ ముగ్గులనూ Way2Newsలో చూడాలనుకుంటే 7331149141 నంబర్‌కు వాట్సాప్ చేయండి. నోట్: ఫొటో, మీ పేరు, గ్రామం, మండలం, జిల్లా పేర్లు కచ్చితంగా పంపగలరు. పండుగను ప్రతిబింబించే ముగ్గులు మాత్రమే (వాట్సాప్ పోస్టు) పబ్లిష్ అవుతాయి.