News March 19, 2025

ఆన్‌లైన్‌ బెట్టింగ్లపై పటిష్ఠ నిఘా: ASF ఎస్పీ

image

ఆన్‌లైన్ బెట్టింగ్, గేమ్‌లకు అలవాటు పడి యువత ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దని జిల్లా ఎస్పీ డీవీ శ్రీనివాసరావు అన్నారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఆన్‌లైన్‌ బెట్టింగ్‌పై పటిష్ఠమైన నిఘా ఏర్పాటు చేశామన్నారు. మోసపూరితమైన సందేశాలను నమ్మి ఇతరులకు తమ వివరాలు ఇవ్వరాదని జిల్లా ప్రజలకు తెలిపారు. ఆన్‌లైన్‌లో డబ్బులు ఎక్కువ ఇస్తామని ఎవరైనా చెప్పితే ఎట్టి పరిస్థితుల్లోనూ నమ్మవద్దన్నారు.

Similar News

News November 24, 2025

అర్ధరాత్రి రౌడీషీటర్ల ఇంటికి CP సజ్జనార్

image

హైద‌రాబాద్ సీపీ వీసీ స‌జ్జ‌నార్ అర్ధరాత్రి పెట్రోలింగ్ వాహ‌నంలో స్వయంగా గస్తీ నిర్వహించారు. లంగ‌ర్‌హౌజ్ పీఎస్ ప‌రిధిలోని ఎండీ లైన్స్, ఆశాంనగర్, డిఫెన్స్‌కాలనీల్లోని రౌడీషీటర్ల ఇళ్లకు నేరుగా వెళ్లారు. ఇంట్లోనే ఉన్న రౌడీషీటర్లను నిద్రలేపి వారి నేర చరిత్ర, ప్రస్తుత జీవనశైలి, వ్యవహార ధోరణులపై ఆరా తీశారు. మళ్లీ నేరాల వైపు అడుగు వేస్తే కఠిన చర్యలు తప్పవని CP సజ్జనార్ హెచ్చరించారు.

News November 24, 2025

BMC బ్యాంక్‌లో ఉద్యోగాలు

image

బాంబే మర్కంటైల్ కోఆపరేటివ్(BMC) బ్యాంక్ లిమిటెడ్‌.. బ్యాంక్ మేనేజర్, క్రెడిట్ ఆఫీసర్, ఏరియా హెడ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. ఏదైనా డిగ్రీతో పాటు పని అనుభవం గల అభ్యర్థులు జనవరి 1, 2026వరకు అప్లై చేసుకోవచ్చు. వయసు 30 -50ఏళ్ల మధ్య ఉండాలి. వెబ్‌సైట్: https://bmcbankltd.com/

News November 24, 2025

భారతీయ వైద్యం వైపు అమెరికన్ల మొగ్గు!

image

అమెరికాతో పోల్చితే ఇండియాలో వైద్య సదుపాయం చాలా బెటర్ అని వైద్యులు చెబుతున్నారు. ఈక్రమంలో పెరుగుతున్న ఖర్చులు, వెయిటింగ్ కారణంగా అమెరికా వంటి పాశ్చాత్య దేశాల రోగులు భారతీయ వైద్యం వైపు మళ్లుతున్నట్లు పేర్కొన్నారు. ‘భారత్‌లో అత్యల్ప ఖర్చు, తక్షణ అపాయింట్‌మెంట్‌లు (సూపర్ స్పెషలిస్ట్‌లతో సహా), MRI/CT స్కాన్ల వంటి త్వరిత డయాగ్నస్టిక్ సేవల వల్ల రోగులకు మెరుగైన సేవలు అందుతున్నాయి’ అని తెలిపారు.