News November 18, 2024
ఆన్‌లైన్ మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలి: ఎస్పీ
పోలీసు ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమం ద్వారా వచ్చిన ఫిర్యాదులను విచారణ జరిపి చట్టపరంగా న్యాయం చేస్తామని జిల్లా ఎస్పీ జి కృష్ణ కాంత్ తెలిపారు. జిల్లా నలుమూలల నుంచి 85 ఫిర్యాదులు అందాయని, వాటి సమస్య పరిష్కారానికి ఆయా పోలీస్ స్టేషన్ పరిధిలో దర్యాప్తు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ఆయన మాట్లాడుతూ.. ఆన్‌లైన్ మోసాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు.
Similar News
News December 12, 2024
తిరుపతి జిల్లా విద్యాసంస్థలకు నేడు సెలవు
భారీ వర్షాల కారణంగా తిరుపతి జిల్లాలోని అన్ని పాఠశాలలు, కళాశాలలు, అంగన్వాడీ కేంద్రాలకు ఇన్‌ఛార్జ్ కలెక్టర్ శుభం బన్సల్ నేడు సెలవు ప్రకటించారు. ఎవరైనా పాఠశాలలు నిర్వహిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. గూడూరు, సూళ్లూరుపేట నియోజకవర్గాలతో పాటు వెంకటగిరి, డక్కిలి, బాలాయపల్లె మండలాలకు మాత్రమే సెలవు వర్తిస్తుంది. నెల్లూరు జిల్లాలో సెలవుపై అధికారులు ఎలాంటి ప్రకటన చేయలేదు.
News December 12, 2024
అనంతసాగరం: తండ్రి, కుమారుల గొడవ.. కొడుకు మృతి
అనంతసాగరం మండలం ఇనగలూరులో తండ్రి-కొడుకుల మధ్య ఘర్షణ జరిగింది. ఈ ఘర్షణలో కొడుకు మృతి చెందాడు. కొడుకు మస్తాన్ రోజు మద్యం సేవించి ఇంటికి వస్తుండేవాడు. దీనితో తండ్రి నబ్బీసాహెబ్ మందలించాడు. ఈ క్రమంలో తండ్రి పై కర్రతో దాడి చేయబోయి పక్కనే ఉన్న రాళ్ల పై పడి కొడుకుకు తీవ్ర గాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ మస్తాన్ మృతి చెందాడు.
News December 12, 2024
నెల్లూరు: సౌదీలో నర్సింగ్ ఉద్యోగాలకు దరఖాస్తులు
రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో బీఎస్సీ నర్సింగ్, పోస్ట్ బీఎస్సీ నర్సింగ్ చదివిన అభ్యర్థులకు సౌదీలో ఉద్యోగ అవకాశాలు కల్పించనున్నట్టు నెల్లూరు జిల్లా ఉపాధి అధికారి వినయ్ కుమార్ పేర్కొన్నారు. అభ్యర్థులు 18-40 ఏళ్ల లోపు వయసు కలిగి ఉండి, ఏదైనా ఆస్పత్రిలో 18 నెలలు పని చేసిన అనుభవం ఉండాలన్నారు. ఈనెల 15వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఎంపికైన వారికి రూ.78- రూ.89 వేలు వేతనం లభిస్తుందన్నారు.