News January 29, 2025
ఆన్‌లైన్ సెక్స్ రాకెట్.. విశాఖలో ఐదుగురు అరెస్ట్

ఆన్‌లైన్ సెక్స్ రాకెట్ కేసులో ఐదుగురు ముద్దాయిలును విశాఖ టూటౌన్ పోలీసులు బుధవారం అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. వీరిలో మద్దిలపాలెంకు చెందిన గొర్లె నరేశ్, వన్ టౌన్ ఏరియాకు చెందిన గంగిరీ పవన్ కళ్యాణ్, సుబ్బలక్ష్మి నగర్‌కు చెందిన నీలగిరి వెంకటలక్ష్మి, ఆరిలోవకు చెందిన గంగిరి పద్మ, విజయనగరానికి చెందిన పెదగాడి శ్రీను ముద్దాయిలుగా ఉన్నారు. పక్కా సమాచారంతో దాడులు చేసినట్లు పోలీసులు తెలిపారు.
Similar News
News February 10, 2025
విశాఖ: నామినేషన్ల దాఖలుకు నేడు ఆఖరు

ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ MLC ఎన్నికకు సంబంధించి నామినేషన్ల దాఖలుకు ఈరోజు ఆఖరి రోజు కాగా ఇప్పటివరకు 8మంది నామపత్రాలు సమర్పించారు. సోమవారం ఎక్కువగా నామినేషన్లు దాఖలయ్యే అవకాశం ఉంది. నామినేషన్ల పరిశీలన ఈనెల 11న చేస్తారు. 13 వరకు ఉపసంహరణకు గడువు ఉంది. 27వ తేదీన పోలింగ్ నిర్వహించనున్నారు. మార్చి 3వ తేదీన ఫలితాలు వెలువడనున్నాయి.
News February 10, 2025
విశాఖలో పోలీస్ అధికారులతో సమీక్ష చేసిన డీజీపీ

విశాఖలో పోలీసుల పనితీరు చాలా బాగుందని క్రైమ్ రేట్ పెరగకూడదని రాష్ట్ర డీజీపీ హరీష్ కుమార్ గుప్తా అన్నారు. కమిషనర్ కార్యాలయంలో అధికారులతో ఆదివారం సమావేశం నిర్వహించి పలు విషయాలు అడిగి తెలుసుకున్నారు. సిబ్బంది సమస్యలు విని పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. కమిషనర్‌తో పాటు డీసీపీలు పాల్గొన్నారు.
News February 9, 2025
విశాఖ: సముద్రంలో మునిగి ఇద్దరు విద్యార్థులు మృతి

విశాఖకు చెందిన ఇద్దరు ఇంజినీరింగ్ విద్యార్థులు అనకాపల్లి జిల్లా రాంబిల్లి మండలం వాడరాంబిల్లి సముద్ర తీరంలో ఆదివారం మృతిచెందారు. మృతులు కంచరపాలేనికి చెందిన మొక్క సూర్యతేజ, దువ్వాడకు చెందిన మొక్క పవన్‌గా గుర్తించారు. రాంబిల్లి బీచ్‌లో స్నానం చేయడానికి వెళ్లారు. ఈ నేపథ్యంలో అలల తాకిడికి సముద్రంలో మునిగి చనిపోయినట్లు పోలీసు అధికారులు ధ్రువీకరించారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.