News March 4, 2025
ఆన్లైన్ సేవలు అందించండి: కలెక్టర్

కలెక్టర్ లక్ష్మీశ ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాల కంప్యూటరీకరణ ప్రగతిపై మంగవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షా సమావేశం నిర్వహించారు. 131 ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాలలో మార్చి 7 నాటికి కంప్యూటరీకరణ పూర్తి కావాలన్నారు. తద్వారా జిల్లాలోని అన్ని పీఏసీలు ఈ-పీఏసీలుగా మార్పు చెందాలని తద్వారా ప్రజలకు కాగితపు రహిత ఆన్లైన్ సేవలు అందించాలని ఆదేశించారు.
Similar News
News November 27, 2025
రోజుకు 10వేల క్యాలరీల ఫుడ్ తిని.. నిద్రలోనే మృతి

రష్యాలో షాకింగ్ ఘటన జరిగింది. ఈటింగ్ ఛాలెంజ్ ద్వారా మొదట బరువు పెరిగి తర్వాత తగ్గే ప్రోగ్రామ్ను ప్రయత్నిస్తూ ఫిట్నెస్ కోచ్ డిమిత్రి నుయాన్జిన్(30) చనిపోయారు. ఆయన రోజుకు 10వేల క్యాలరీలకుపైగా జంక్ ఫుడ్ తిన్నట్లు తెలుస్తోంది. డిమిత్రి ప్రయత్నం వికటించి ఒక నెలలోనే 13KGలు పెరిగి 103KGలకు చేరారు. చివరికి గుండెపోటుతో నిద్రలోనే మరణించారు. ఇలాంటి ఛాలెంజ్లను ఎవరూ అనుసరించొద్దని నిపుణులు సూచిస్తున్నారు.
News November 27, 2025
అనంత: పాఠశాలల్లో ఖాళీ పోస్టులకు దరఖాస్తులు

అనంతపురంలో 2 ఎయిడెడ్ పాఠశాలల్లో ఖాళీగా ఉన్న 10 టీచర్ పోస్టుల భర్తీకి దరఖాస్తు గడువును పొడిగించినట్లు డీఈవో ప్రసాద్ బాబు తెలిపారు. సెయింట్ మేరీ బాలికల ఎయిడెడ్ ఉన్నత పాఠశాలలో ఎస్ఏ బయాలజీ, ఎస్ఏ తెలుగు, LPT (తెలుగు, హిందీ), పీఈటీ పోస్టులు ఉన్నాయన్నారు. RCM ఎయిడెడ్ ప్రైమరీ స్కూల్లో 5 SGT పోస్టులు ఖాళీగా ఉన్నాయన్నారు. దరఖాస్తు గడువును డిసెంబర్ 10 వరకు పొడిగించామన్నారు.
News November 27, 2025
అమరావతిలో వేంకటేశ్వర ఆలయం రెండేళ్లలో పూర్తి: సీఎం

AP: దేవతల రాజధాని అమరావతి అని, మన రాజధానికి అమరావతి పేరు పెట్టే అవకాశం దేవుడు తనకిచ్చారని CM CBN చెప్పారు. కృష్ణా తీరంలో వేంకటేశ్వర ఆలయ విస్తరణ పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. ‘ఈ ప్రాంతాన్ని కాపాడే శక్తి ఈ గుడికి ఉంది. రెండేళ్లలో పనులు పూర్తి చేయాలని TTDని కోరుతున్నా. ఈ పవిత్ర కార్యక్రమానికి ప్రజలు సహకరించాలి. ఆరోగ్యం, సంపద, ఆనందం ప్రతిఒక్కరికీ ఇవ్వాలని స్వామిని వేడుకుంటున్నా’ అని పేర్కొన్నారు.


