News January 26, 2025

ఆన్ లైన్ బిల్స్ చెల్లించేటప్పుడు జాగ్రత్త: అన్నమయ్య పోలీస్

image

ఆన్ లైన్ బిల్స్ చెల్లించేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని అన్నమయ్య పోలీసులు సూచిస్తున్నారు. వెబ్ సైట్లను ఒకటికి రెండుసార్లు చెక్ చేసుకోవాలని, డిస్కౌంట్ల కోసం థర్డ్ పార్టీ యాప్స్, వెబ్ సైట్లను వాడొద్దని, క్రెడిట్ కార్డు వివరాలను అపరిచిత వెబ్ సైట్లలో పంచుకోవద్దన్నారు. క్రెడిట్ కార్డు మిస్ అయిన వెంటనే తొందరగా బ్లాక్ చేయాలని, కస్టమర్ కేర్ నెంబర్ల కోసం అధికారిక సైట్లను మాత్రమే ఆశ్రయించాలని తెలిపారు.

Similar News

News November 15, 2025

రేపు బాపట్ల జిల్లాకు రానున్న గవర్నర్

image

గవర్నర్ అబ్దుల్ నజీర్ ఆదివారం బాపట్ల జిల్లాలో పర్యటించనున్నారు. గవర్నర్ ఉదయం 10 గంటలకు రాజ్‌భవన్‌ నుంచి బయలుదేరి 11.45కి సూర్యలంక గోల్డెన్ సాండ్ బీచ్ చేరుకుని విశ్రాంతి తీసుకుంటారు. రాత్రి 7.55కి తిరుగు ప్రయాణం అవుతారు. పర్యటన ఏర్పాట్లపై కలెక్టర్ డాక్టర్ వి.వినోద్ కుమార్ ఆధ్వర్యంలో శనివారం అధికారులు సమన్వయ సమావేశం నిర్వహించారు.

News November 15, 2025

చంద్రగిరి: బీటెక్ విద్యార్థి మృతి

image

చంద్రగిరి మండలం కోదండరామాపురం సమీపంలో శనివారం రోడ్డు ప్రమాదం జరిగింది. బంగారుపాళ్యానికి చెందిన లక్ష్మీకాంత్ చిత్తూరు సమీపంలోని ఓ ప్రైవేట్ కాలేజీలో బీటెక్ ఫైనల్ ఇయర్ చదువుతున్నాడు. బైక్‌పై తిరుపతికి వచ్చే క్రమంలో లారీని ఢీకొన్నాడు. విద్యార్థి అక్కడికక్కడే చనిపోయాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

News November 15, 2025

ఏలూరు: 72 ప్రైవేటు బస్సులపై కేసులు..రూ.7.65 లక్షల జరిమానా

image

ఏలూరు జిల్లాలో శనివారం ఉదయం నుంచి రవాణా శాఖ తనిఖీలు చేసింది. ఈ సోదాల్లో మొత్తం 72 ప్రైవేటు బస్సులపై కేసుల నమోదు చేశామని డీటీసీ(జిల్లా రవాణాధికారి కమిషనర్) షేక్ కరీం తెలిపారు. ఏలూరు హైవేలోని కలపర్రు వద్ద తనిఖీలు జరగగా..రూ. 7.65 లక్షల జరిమానా విధించామని చెప్పారు. నిబంధనలకు విరుద్ధంగా ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులు నడిపితే సీజ్ చేస్తామని డీటీసీ హెచ్చరించారు.