News April 10, 2025

ఆపేరల్ పార్కులో మంత్రుల పర్యటన ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్, ఎస్పీ

image

సిరిసిల్ల అపెరల్ పార్క్‌లోని టెక్స్ పోర్ట్ యూనిట్‌ను రేపు మంత్రులు ప్రారంభించనున్న నేపథ్యంలో గురువారం ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా, ఎస్పీ మహేష్ బి గితేతో కలిసి వేములవాడ ఎమ్మెల్యే అది శ్రీనివాస్ పరిశీలించారు. ఈ కార్యక్రమంలో కేకే మహేందర్ రెడ్డి, ప్రజాప్రతినిధులు, అధికారులు ఉన్నారు.

Similar News

News December 13, 2025

వంటింటి చిట్కాలు

image

* బియ్యం డబ్బాలో నాలుగు వెల్లుల్లి రెబ్బలు ఉంచితే పురుగు చేరదు.
* వండటానికి ముందు ఆకుకూరలను పంచదార నీళ్ళలో ఉంచితే కూరలు రుచిగా వుంటాయి.
* అరిసెలు వండేటప్పుడు పాకంలో బియ్యం పిండి సరిపోకపోతే తగినంత గోధుమపిండి కలపండి.
* పెండలం, కంద దుంపలు ముక్కలుగా కోసిన తరువాత కాసేపు పెరుగులో ఉంచితే జిగురు పోతుంది. కూర రుచిగా ఉంటుంది.

News December 13, 2025

నరసాపురంలో జాతీయ లోక్ అదాలత్ ప్రారంభం

image

నరసాపురం కోర్టు ప్రాంగణంలో శనివారం నిర్వహించిన జాతీయ లోక్ అదాలత్‌ను జిల్లా అదనపు న్యాయమూర్తి వాసంతి ప్రారంభించారు. ఈ సందర్భంగా కక్షిదారులను ఉద్దేశించి న్యాయమూర్తి మాట్లాడుతూ..కేసులు పరిష్కారంలో రాజీయే రాజమార్గమన్నారు. దీనివల్ల కక్షలు పెరగవని కోట్లు చుట్టూ చుట్టూ తిరిగి సమయాన్ని డబ్బును వృథా చేసుకోవలసిన అవసరం ఉండదు అన్నారు.

News December 13, 2025

అఖండ-2.. తొలిరోజు రూ.59.5 కోట్ల కలెక్షన్లు

image

బాలకృష్ణ హీరోగా తెరకెక్కిన అఖండ-2 సినిమా బాక్సాఫీస్ వద్ద అదరగొట్టింది. ప్రీమియర్స్‌తో కలిపి తొలి రోజు ప్రపంచవ్యాప్తంగా రూ.59.5 కోట్ల గ్రాస్ కలెక్షన్లు సాధించినట్లు మేకర్స్ వెల్లడించారు. బాలయ్య కెరీర్‌లో ఇవే బిగ్గెస్ట్ ఓపెనింగ్ కలెక్షన్లు అని తెలిపారు. నిన్న విడుదలైన ఈ చిత్రానికి పాజిటివ్ టాక్ వచ్చిన విషయం తెలిసిందే. ఆది పినిశెట్టి, సంయుక్త, హర్షాలీ కీలక పాత్రలు పోషించారు.