News April 10, 2025
ఆపేరల్ పార్కులో మంత్రుల పర్యటన ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్, ఎస్పీ

సిరిసిల్ల అపెరల్ పార్క్‌లోని టెక్స్ పోర్ట్ యూనిట్‌ను రేపు మంత్రులు ప్రారంభించనున్న నేపథ్యంలో గురువారం ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా, ఎస్పీ మహేష్ బి గితేతో కలిసి వేములవాడ ఎమ్మెల్యే అది శ్రీనివాస్ పరిశీలించారు. ఈ కార్యక్రమంలో కేకే మహేందర్ రెడ్డి, ప్రజాప్రతినిధులు, అధికారులు ఉన్నారు.
Similar News
News April 17, 2026
ఎల్కతుర్తి ఎస్‌ఐ ఏఆర్‌కు అటాచ్

హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి ఎస్‌ఐ ప్రవీణ్ కుమార్‌పై వచ్చిన ఆరోపణలు నిర్ధారణ కావడంతో అధికారులు చర్యలు చేపట్టారు. విచారణ నివేదిక ఆధారంగా ఆయన్ను ఏఆర్‌కు అటాచ్ చేస్తూ వరంగల్ పోలీస్ కమిషనర్ సన్‌ప్రీత్ సింగ్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ చర్యతో పోలీస్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఇటీవల ఇద్దరి ఎస్సైలపై వేటు వేసిన విషయం తెలిసిందే.
News April 17, 2026
ఇందూరు కోట.. ఖిల్లా రఘునాథ ఆలయం

నిజామాబాద్ నగర నడిబొడ్డున ఎత్తైన గుట్టపై ఉన్న ఈ కోటను రాష్ట్రకూటులు నిర్మించగా, అనంతరం ఛత్రపతి శివాజీ దీనిని అభివృద్ధి చేశారు. ఇక్కడి రామమందిరం ఆధ్యాత్మికతకు నిలయం. కోటలోని రాతి కట్టడాలు, బురుజులు నాటి ఇంజనీరింగ్ నైపుణ్యానికి సాక్ష్యాలు. పర్యాటక కేంద్రంగా విరాజిల్లుతున్న ఈ ఆలయం నుండి నగరం మొత్తాన్ని చూడవచ్చు. ఈ చారిత్రక సంపదను కాపాడుకోవడం మన బాధ్యత.
#నేడు ప్రపంచ వారసత్వ దినోత్సవం
News April 17, 2026
వనరాజా కోళ్ల ప్రత్యేకత ఏమిటి?

పెరటి కోళ్ల పెంపకానికి ‘వనరాజా’ మరో అనువైన రకం. ఇవి అధిక సంఖ్యలో గుడ్లు, అధిక మాంసోత్పత్తికి ప్రసిద్ధి చెందాయి. వీటికి రోగనిరోధక శక్తి ఎక్కువ. ఆకర్షణీయమైన రంగులో ఈకలను కలిగి ఉంటాయి. 10-12 వారాల వయసులోనే పుంజులు మంచి బరువుకు వస్తాయి. 5 నెలల వయసుకు 2.5కిలోల బరువు పెరిగి అధిక పోషకాలతో కూడిన మాంసాన్నిస్తాయి. పెట్టకోడి ఏటా 150 గుడ్లను పెడుతుంది. ఇది కుక్కలు, పిల్లుల బారి నుంచి త్వరగా తప్పించుకుంటుంది.


