News July 30, 2024

ఆమదాలవలసలో ‘ఆకలి’ మూవీ షూటింగ్ ప్రారంభం

image

చలనచిత్ర పరిశ్రమ అభివృద్ధికి కృషి చేస్తామని ఎమ్మెల్యే కూన రవికుమార్ అన్నారు. ఆమదాలవలసలోని పాలపోలమ్మ అమ్మవారి ఆలయం ఆవరణలో జరుగుతున్న ‘ఆకలి’ చిత్ర షూటింగ్‌ను మంగళవారం ఆయన క్లాప్ కొట్టి ప్రారంభించారు. కళింగ ఆర్ట్ క్రియేషన్స్ బ్యానర్‌పై అప్పారావు దర్శకత్వంలో నిర్మిస్తున్నారు. కార్యక్రమంలో చిత్ర హీరోలు, హీరోయిన్స్, నటులు సనపల అన్నాజీరావు, కృష్ణారావు, టీడీపీ నాయకులు తంబి, రమేశ్ పాల్గొన్నారు.

Similar News

News November 20, 2025

ఈ ఉద్యమమే టెక్ శంకర్‌ను మావోయిస్టుగా మార్చింది

image

మావోయిస్ట్ జోగారావు అలియాస్ టెక్ శంకర్ నిన్న జరిగిన ఎన్‌కౌంటర్‌లో మృతి చెందిన విషయం తెలిసిందే. దీంతో స్వగ్రామం వజ్రపుకొత్తూరు(M)బాతుపురంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. 1988లోని పీపుల్స్ ఉద్యమంతో మావోయిస్టుల పార్టీలో చేరి 1995 DEC 1న ఒంగోలు మాజీ MP సుబ్బరామిరెడ్డిపై కాల్పుల కేసులో శంకర్‌ది కీలక పాత్రని సమాచారం. బాతుపురంలో స్తూపం ఆవిష్కరణకు గద్దర్‌ రాకతో రాష్ట్రంలో ఈయన పేరు మార్మోగింది.

News November 20, 2025

శ్రీకాకుళం జిల్లాలో రూ.25 వేల జీతంతో ఉద్యోగాలు

image

శ్రీకాకుళంలో రేపు జిల్లా ఉపాధి అధికారి ఆధ్వర్యంలో జరగనున్న జాబ్ మేళాకు చిక్కోల్ సోలార్ ఎనర్జీ సర్వీసెస్, శ్రీరామ్ చిట్స్ ఫైనాన్స్ కంపెనీలు హాజరుకానున్నాయి. టెన్త్-డిగ్రీ చదివిన పురుష అభ్యర్థులు ఈ మేళాకు అర్హులు. ఎంపికైన వారు శ్రీకాకుళం, నరసన్నపేటలో పని చేయాలని, రూ.15,000-25,000 జీతం ఇస్తారని ఆ శాఖాధికారి సుధా చెప్పారు. దరఖాస్తుకు https://WWW.NCS.GOV.IN వెబ్‌సైట్‌‌ను సంప్రదించాలన్నారు.

News November 19, 2025

ఎన్ కౌంటర్‌లో శ్రీకాకుళం మావోయిస్టు మృతి

image

ఇవాళ అల్లూరి జిల్లా మారేడుమిల్లి ఏజేన్సీలో జరిగిన ఎన్ కౌంటర్‌లో ఏడుగురు మావోయిస్టులు హతమైనట్లు AP ఇంటెలిజెన్స్ ADG మహేశ్ చంద్ర లడ్డా ధ్రువీకరించారు. ఈ ఎదురుకాల్పుల్లో శ్రీకాకుళం జిల్లాకు చెందిన మెట్టూరి జోగారావు మృతి చెందినట్లు సమాచారం.