News July 30, 2024
ఆమదాలవలసలో ‘ఆకలి’ మూవీ షూటింగ్ ప్రారంభం

చలనచిత్ర పరిశ్రమ అభివృద్ధికి కృషి చేస్తామని ఎమ్మెల్యే కూన రవికుమార్ అన్నారు. ఆమదాలవలసలోని పాలపోలమ్మ అమ్మవారి ఆలయం ఆవరణలో జరుగుతున్న ‘ఆకలి’ చిత్ర షూటింగ్‌ను మంగళవారం ఆయన క్లాప్ కొట్టి ప్రారంభించారు. కళింగ ఆర్ట్ క్రియేషన్స్ బ్యానర్‌పై అప్పారావు దర్శకత్వంలో నిర్మిస్తున్నారు. కార్యక్రమంలో చిత్ర హీరోలు, హీరోయిన్స్, నటులు సనపల అన్నాజీరావు, కృష్ణారావు, టీడీపీ నాయకులు తంబి, రమేశ్ పాల్గొన్నారు.
Similar News
News July 11, 2025
ఎచ్చెర్ల: దారుణంగా హత్య చేశారు

ఎచ్చెర్ల మండలంలో గోపి అనే వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. శుక్రవారం మధ్యాహ్నం ఫరీద్ పేట గ్రామ జంక్షన్ సమీపంలో ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా గుర్తు తెలియని వ్యక్తులు గోపిపై అతి కిరాతకంగా దాడి చేసి చంపేశారని స్థానికులు చెబుతున్నారు. విషయం తెలుసుకున్న ఎచ్చెర్ల పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
News July 11, 2025
సారవకోట: ఆగి ఉన్న లారీని ఢీకొన్న ఆటో..ఒకరి మృతి

సారవకోట(M) కృష్ణాపురం సమీపంలో రహదారిపై గురువారం ఆగి ఉన్న లారీను వెనక నుంచి ఆటో బలంగా ఢీకొంది. ఈ ప్రమాదంలో ఆటో డ్రైవర్‌తో పాటు నలుగురు ప్రయాణికులకు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు క్షతగాత్రులను హుటాహుటిన శ్రీకాకుళం జిల్లా ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ.. అమ్మనమ్మ (56) మృతి చెందింది. మరో నలుగురు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
News July 11, 2025
శ్రీకాకుళం జిల్లా టుడే టాప్ న్యూస్ ఇవే

✯ మెళియాపుట్టి: విద్యుత్ షాక్ తో 5వ తరగతి విద్యార్థి మృతి
✯మందసలో అధికారులను అడ్డుకున్న రైతులు
✯ విద్యార్థులతో కలిసి భోజనం చేసిన ఎమ్మెల్యే రవికుమార్
✯ సారవకోట: లారీని ఢీకొన్న ఆటో.. ఐదుగురికి తీవ్ర గాయాలు
✯ కళింగపట్నంలో పనులను పరిశీలించిన కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు
✯ పలాస: గంజాయితో ముగ్గురు అరెస్ట్
✯ కంచిలి: అధ్వానంగా ఆసుపత్రి పరిసరాలు
✯ టెక్కలి: శాకాంబరీదేవిగా శివదుర్గ అమ్మవారు