News June 4, 2024
ఆమదాలవలసలో స్పీకర్ ఓటమి

ఆమదాలవలస నియోజకవర్గానికి సంబంధించిన ఓట్ల లెక్కింపు ప్రక్రియ ముగిసింది. టీడీపీ అభ్యర్థి కూన కుమార్, వైపీపీ అభ్యర్థి తమ్మినేని సీతారాంపై వేల పైచిలుకు 33,285 ఓట్ల తేడాతో విజయం సాధించారు. దీంతో టీడీపీ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నాయి. ఇంకా పోస్టల్ బ్యాలెట్ ఓట్లు లెక్కింపు జరుగుతోంది.
Similar News
News December 9, 2025
శ్రీకాకుళం: తల్లి మందలించిదని పురుగులమందు తాగి యువతి ఆత్మహత్య

రణస్థలం మండలం ముక్తంపురానికి చెందిన ఇంటర్ విద్యార్థిని కీర్తి (16) ఆసుపత్రిలో చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందింది. జే.ఆర్.పురం పోలీసులు వివరాలు మేరకు.. కీర్తి ఈనెల 6న ఇంట్లో TV చూస్తుండగా తన తల్లి మందలించింది. దీంతో మనస్తాపానికి గురైన కీర్తి పురుగులమందు తాగింది. దీంతో ఆమెను శ్రీకాకుళం రిమ్స్కు తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందింది. ఘటనపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ చిరంజీవి తెలిపారు.
News December 9, 2025
శ్రీకాకుళం: రేపటి నుంచి ఏపీ టెట్ పరీక్షలు

శ్రీకాకుళం జిల్లాలో ఏపీ టెట్ పరీక్షలు నిర్వహించడం జరుగుతుందని జిల్లా విద్యాశాఖ అధికారి ఏ.రవిబాబు సోమవారం ఓ ప్రకటన విడుదల చేశారు. ఈనెల 10వ తేదీ నుంచి 21వ తేదీ వరకు ఉదయం, మధ్యాహ్నం పరీక్షలు నిర్వహిస్తున్నామన్నారు. వీటి కోసం జిల్లాలో నాలుగు కేంద్రాలను ఎంపిక చేస్తామని వెల్లడించారు. ఎచ్చెర్లలో శివాని, వెంకటేశ్వర కళాశాలలు, నరసన్నపేటలో కోర్ టెక్నాలజీ, టెక్కలి ఐతమ్లో పరీక్షలు జరుగుతాయని పేర్కొన్నారు.
News December 9, 2025
డ్రగ్స్ నిర్మూలనకు పోలీసుల వినూత్న కార్యక్రమం: ఎస్పీ

మాదకద్రవ్యాల నిర్మూలనకు పోలీసు శాఖ వినూత్న కార్యక్రమానికి కార్యరూపం దాల్చిందని శ్రీకాకుళం ఎస్పీ కె.వి. మహేశ్వర రెడ్డి పేర్కొన్నారు. సోమవారం ఎస్పీ కార్యాలయంలో అధికారులతో సమీక్ష నిర్వహించారు. విశాఖపట్నం రేంజ్ డీఐజీ గోపీనాథ్ జట్టి నేతృత్వంలో గత నెల 12న ప్రారంభమైన ‘అభ్యుదయం’ సైకిల్ యాత్ర ఈ నెల 15న రణస్థలం చేరుకుంటుందని, దీనిని విజయవంతం చేయాలని ఆయన సూచించారు.


