News January 6, 2025
ఆమదాలవలస: అత్యాచారం కేసులో నిందితుడికి రిమాండ్
ఆమదాలవలసలో ఓ మైనర్ బాలికపై అదే వీధికి చెందిన కోటిపల్లి రాజు (23) మాయమాటలు చెప్పి ప్రేమ పేరుతో అత్యాచారం చేసి గర్భవతిని చేసిన ఘటన విధితమే. ఈ మేరకు సోమవారం ఆమదాలవలస పోలీస్ స్టేషన్‌లో డీఎస్పీ సీహెచ్ వివేకానంద మీడియా సమావేశం నిర్వహించారు. నిందితుడిపై పోక్సో కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలిస్తామని అన్నారు. సీఐ సత్యనారాయణ, ఎస్ఐ బాలరాజు పోలీసులు ఉన్నారు.
Similar News
News January 26, 2025
బొబ్బిలిపేటలో వ్యక్తి దారుణ హత్య
ఆమదాలవలస మండలం బొబ్బిలిపేట గ్రామంలో వ్యక్తి దారుణ హత్యకు గురయ్యారు. అదే గ్రామానికి చెందిన గురుగుబెల్లి చంద్రయ్య (47)ను శనివారం రాత్రి గుర్తుతెలియని వ్యక్తులు గ్రామ పొలిమేరలో వద్ద హత్య చేశారు. హత్యకు గురైన చంద్రయ్య వైసీపీ కార్యకర్తగా గ్రామంలో కొనసాగుతున్నారు. ఈయన రియల్ ఎస్టేట్ వ్యాపారంలో కూడా ఉన్నారు. హత్యకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
News January 26, 2025
గార: పురుగుల మందు తాగి .. యువకుడి ఆత్మహత్య
కడుపు నొప్పి తట్టుకోలేక కుమ్మరిపేట గ్రామానికి చెందిన కె.శ్రావణ్ కుమార్ (32) ఆత్మహత్య చేసుకున్నాడు. ఇతను ఎచ్చెర్ల IIITలో ఔట్సోర్సింగ్ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. కొన్నిరోజులుగా కడుపునొప్పి సమస్యతో బాధపడుతున్నాడు. శనివారం పురుగుల మందు తాగడంతో కుటుంబ సభ్యులు 108 వాహనంలో ఆసుపత్రిలో చేర్చారు. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు చేసినట్లు ఎస్ఐ జనార్దన్ తెలిపారు.
News January 26, 2025
బూర్జ: బ్రెయిన్ డెడ్.. అవయవదానంకు అంగీకారం
బూర్జ మండలంలోని ఓవి పేట గ్రామానికి చెందిన పేడాడ దశరథరావు (59)బ్రెయిన్ డెడ్‌తో రిమ్స్ సర్వజన ఆసుపత్రిలో మరణించారు. అవయవదానానికి కుటుంబసభ్యులు ముందుకు రావడంతో కేసు నమోదు చేసినట్లు బూర్జ ఎస్ఐ ప్రవల్లిక తెలిపారు. మృతుడు పొలానికి వెళ్లి వస్తుండగా కోనేరు సమీపంలో కింద పడిపోవడంతో తలకు బలమైన గాయం తగిలి,అధిక రక్తస్రావం కావడంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించినట్లు ఎస్సై తెలిపారు.