News May 30, 2024

ఆమదాలవలస: నిప్పుల కుంపటిలా వాతావరణం

image

ఆమదాలవలస నియోజకవర్గ పరిధికి చెందిన మండలంలో గురువారం వాతావరణం నిప్పుల కుంపటిలా మారిందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. వాతావరణంలో భానుడి ప్రతాపం అధికం కావడంతో ఇంటి నుంచి బయటకు రావాలంటేనే భయాందోళన చెందుతున్నారు. ఎండ వేడి, ఉక్కపోతతో చిన్నారులు, వృద్ధులు అవస్థలు పడుతున్నారు. తోపుడు బండ్లపై వ్యాపారులు, దినసరి కూలీల పరిస్థితి దయనీయంగా తయారైంది. అవసరమైతే గానీ బయటకు రావొద్దని వైద్యులు సూచిస్తున్నారు.

Similar News

News October 6, 2024

రైలు నుంచి జారిపడి సిక్కోలు జవాన్ మృతి

image

రైలు పైనుంచి ప్రమాదవశాత్తు జారిపడి శ్రీకాకుళం జిల్లా నందిగంకు చెందిన జీ.జగదీశ్వరరావు(37) అనే SSB(Sashastra Seema Bal) జవాన్ మృతిచెందాడు. సెలవుపై ఇంటికి వచ్చేందుకు గాను పశ్చిమబెంగాల్ రాష్ట్రం కోల్‌కతా నుంచి రైలులో వస్తున్న క్రమంలో ప్రమాదవశాత్తు రైలు నుంచి జారిపడడంతో తీవ్ర గాయాలై మృతిచెందాడు. రైల్వే పోలీసులు కుటుంబసభ్యులకు సమాచారం అందించారు. మృతదేహాన్ని తీసుకువచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

News October 6, 2024

SKLM: పారదర్శకంగా ఇసుక సరఫరా: కలెక్టర్

image

ఇసుక పంపిణీ విధానం జిల్లాలో చట్టబద్ధంగా, సజావుగా, సులభతరంగా సాగేలా పటిష్ఠమైన చర్యలు తీసుకుంటున్నామని కలెక్టర్‌ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ పేర్కొన్నారు. ఎస్పీ మహేశ్వర రెడ్డి పలువురు అధికారులతో కలెక్టర్ కార్యాలయంలో ఆదివారం సమావేశం నిర్వహించారు. జిల్లాలో ఇసుక కొర‌త లేదని, ప్రస్తుతానికి 6000 మెట్రిక్ టన్నులు ఇసుక అందుబాటులో ఉందని, ఇసుక బుక్ చేసుకున్న 24 గంటల్లోనే సరఫరా చేస్తున్నామని వివరించారు.

News October 6, 2024

శ్రీకాకుళం: అక్ర‌మంగా ఇసుక‌ ర‌వాణా చేస్తే క‌ఠిన చ‌ర్య‌లు: ఎస్పీ

image

శ్రీకాకుళం జిల్లాలో ఎక్క‌డైనా అక్ర‌మంగా ఇసుక త‌వ్వ‌కాలు జ‌రిపినా, అక్ర‌మంగా ఇసుక‌ను ర‌వాణా చేసి క‌ఠిన చ‌ర్య‌లు తీసుకుంటామని హెచ్చరించారు.. వీరికి భారీగా జ‌రిమానా విధించ‌డంతోపాటు, కేసులు కూడా న‌మోదు చేస్తామ‌న్నారు. ఇప్పటి వరకు అక్రమార్కులపై రూ.5.75 లక్షలు జరిమానా కూడా విధించామని, పోలీస్‌, రెవెన్యూ, మైనింగ్ అధికారుల‌తో జిల్లా స్థాయి టాస్క్‌పోర్స్‌ను ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు.