News August 3, 2024
ఆమదాలవలస పోలీస్ స్టేషన్‌లో ఎస్పీ తనిఖీలు
రాత్రి వేళలో ముమ్మురంగా పెట్రోలింగ్ చేయడంతో పాటు గస్తీ విధులు పటిష్టంగా నిర్వర్తించాలని ఎస్పీ మహేశ్వరరెడ్డి ఆదేశించారు. శనివారం రాత్రి ఆమదాలవలస మండల పోలీస్ స్టేషన్ ను ఆయన తనిఖీ చేశారు. అనంతరం పోలీసు స్టేషన్‌లోని రిసెప్షన్ కేంద్రంతో పాటు స్టేషన్ పరిసరాలను పరిశీలించారు. పలు ముఖ్యమైన డ్యూటీ రిజిస్టర్ నిర్వహణ క్షుణ్ణంగా చూసి, రికార్డుల నిర్వహణ సక్రమంగా ఉండాలని సిబ్బంది సూచించారు.
Similar News
News September 8, 2024
శ్రీకాకుళం జిల్లాలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు
రానున్న 2 రోజులు జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ తెలిపారు. మత్స్యకారులు 3 రోజులు వేటకు వెళ్లొద్దని, నదీ పరిహక ప్రాంతంలో అప్రమత్తంగా ఉండాలన్నారు. వర్షాల కారణంగా భారీ నష్టాలకు సంబంధించిన ఏదైనా సమాచారం ఉంటే కంట్రోల్ రూమ్ నంబర్ 08942-240557కు ఫోన్ చేయాలని, అలాగే ఈ-మెయిల్ ఐడీ cosklmsupdtd@gmail.com ద్వారా ఫొటోలను పంపించాలని తెలిపారు.
News September 7, 2024

శ్రీకాకుళం: మరో మూడు రోజులు భారీ వర్షాలు
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా మూడు రోజులు పాటు భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయి వాతావరణ శాఖ అధికారులు ఒక ప్రకటన విడుదల చేశారు. వారు మాట్లాడుతూ.. 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులతో భారీ వర్షాలు అవకాశాలు ఉన్నాయి. మత్స్యకారులు ఎవరు వేటకు వెళ్లొద్దని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.