News October 2, 2024
ఆమదాలవలస: మహాత్మా గాంధీ నాటిన మొక్క నేడు మహా వృక్షం

క్విట్ ఇండియా ఉద్యమ సమయంలో ఉద్యమకారుల్లో స్ఫూర్తి నింపేందుకు మహాత్మా గాంధీ ఆమదాలవలస మండలం దూసి రైల్వే స్టేషన్కు 1942లో చేరుకున్నారు. అక్కడ రైల్వే స్టేషన్లో దిగి సమరయోధులతో స్వాతంత్ర్య కాంక్షపై మాట్లాడారు. అనంతరం ఒక మర్రి మొక్కను నాటారు. నేడు అది మహావృక్షంగా మారింది. ఈ వృక్షానికి 82 ఏళ్లు వయసైందని దూసి గ్రామస్థులు చెబుతున్నారు.
Similar News
News December 11, 2025
శ్రీకాకుళం: జైల్లో పరిచయం.. బయటకొచ్చి దొంగతనాలు

బూర్జలో చోరీలకు పాల్పడిన ఐదుగురిని పోలీసులు బుధవారం అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. విశాఖ, కోనసీమ, బిహార్కు చెందిన నాగరాజు, ఆనంద్, శ్రీను, చంటిబాబు, శుభం మిశ్రా పాత కేసుల్లో జైలుకెళ్లారు. బయటొచ్చాక గాజువాకలో స్థిరపడ్డారు. శ్రీను అత్తగారి ఊరు శ్రీకాకుళం జిల్లా బూర్జ. ఆ గ్రామానికి చెందిన రమేశ్ ఇంటికి తాళం వేసి ఉండటాన్ని శ్రీను గమనించాడు. ఈ నెల 1న అందరూ కలిసి దొంగతనం చేసినట్లు DSP వివేకానంద తెలిపారు.
News December 11, 2025
శ్రీకాకుళం కలెక్టర్కు 15వ ర్యాంక్

సిక్కోలు కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ 15వ ర్యాంకు సంపాదించారు. ఆయన వద్దకు ప్రజల సమస్యలపై 931 ఫైల్స్ రాగా 703 పరిష్కరించారు. ఒక్కో ఫైల్ను పరిష్కరించేందుకు ఆయన 2 రోజుల 3 గంటల సమయం తీసుకున్నారు. దీంతో ఆయన పనితీరుకు CM చంద్రబాబు రాష్ట్ర వ్యాప్తంగా ఈ ర్యాంక్ ఇచ్చారు
News December 11, 2025
శ్రీకాకుళం: ‘అభ్యుదయం సైకిల్ యాత్రను విజయవంతం చేయాలి’

శ్రీకాకుళం జిల్లాలో ఈ నెల 15-29 వరకు శ్రీకాకుళం నుంచి ఇచ్ఛాపురం వరకు జరిగే “అభ్యుదయం సైకిల్ యాత్ర”ను విజయవంతం చేయాలని ఎస్పీ కెవి మహేశ్వర రెడ్డి కోరారు. బుధవారం ఎస్పీ కార్యాలయంలో పలు శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. జిల్లాలో ఈ నెల 15న ప్రారంబమయ్యే అభ్యుదయం సైకిల్ యాత్ర పలు శాఖల వారీగా చర్చించి పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. DM&HO, RDOలు ఉన్నారు.


