News March 26, 2024
ఆమదాలవలస: విరిగిన ఆటో చక్రం… తప్పిన ప్రమాదం

ఆమదాలవలస నుంచి శ్రీకాకుళం వెళ్లే ప్రధాన రహదారి విస్తరణ పనులు పూర్తిస్థాయిలో జరగకపోవడంతో గోతుల రహదారిలోనే ప్రయాణించాల్సి వస్తుందని పలువురు వాహనదారులు వాపోతున్నారు. తాజాగా సోమవారం రాత్రి గోతిలో దిగబడిన ఆటో ముందు చక్రం విరిగిపడింది. అయితే ఆ సమయంలో వెనుక నుంచి వస్తున్న లారీ డ్రైవర్ అప్రమత్తం కావడంతో పెను ప్రమాదం తప్పిందని ఆటో డ్రైవర్ లక్ష్మీనారాయణ తెలిపారు. రహదారిని బాగు చేయాలని కోరారు.
Similar News
News January 23, 2026
SKLM: నేడు అలరించనున్న ప్రత్యేక షోలు ఇవే

➤మధ్యాహ్నం 2గం నుంచి డై&నైట్ కూడలి నుంచి అరసవల్లి వరకు శోభాయాత్ర
➤సాయంత్రం 5గం.సాక్సోఫోన్, శాస్త్రీయ నృత్య ప్రదర్శన, ఆరోహి మ్యూజికల్ అకాడమీ షోలు
➤రాత్రి 7గం.నుంచి జబర్దస్త్ టీమ్ తో కామెడీ షో, ఢీ డాన్సర్స్ బృందంతో నృత్యాలు
➤ జానపద గీతాలు ఆలాపన
➤అద్భుతమైన లేజర్, డ్రోన్ షో
ఈ కార్యక్రమాల గురించి అధికారులు గురువారం ఓ ప్రకటనలో తెలిపారు.
News January 23, 2026
SKLM: ప్రతి 10ని.లకు ప్రత్యేక బస్సు

రథసప్తమి వేడుకల సందర్భంగా ఈ నెల 25న RTC ప్రత్యేక బస్సులు నడపనున్నట్లు జిల్లా ప్రజా రవాణా అధికారి సి.హెచ్. అప్పల నారాయణ గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. ప్రయాణీకుల సౌకర్యార్థం, విశాఖ, విజయనగరం, రాజాం, పాలకొండ, బత్తిలి, శ్రీముఖలింగం, పాతపట్నం, టెక్కలి, పలాస నుంచి సాధారణ ఛార్జీలతో నడుస్తాయన్నారు. ప్రతి 10 నిమిషాలకు ప్రత్యేక బస్సులు రాకపోకలు సాగిస్తాయన్నారు.
News January 22, 2026
నరసన్నపేటలో అక్రమంగా షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణాలు..వైసీపీ ఆరోపణ

నరసన్నపేట మండలం తామరపల్లిలో ప్రభుత్వ భూమిలో అక్రమంగా షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణాలు జరుగుతున్నట్లు వైసీపీ ఆరోపించింది. ఈ కట్టడాలపై రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేశామని, అధికార పార్టీ నాయకుల అండతోనే నిర్మాణాలు చేపడుతున్నా.. యంత్రాంగం అడ్డుకోలేదని వైసీపీ విమర్శించింది. ఈ మేరకు సోషల్ మీడియాలో ఆ పార్టీ ఓ వీడియోను పోస్టు చేసింది.


