News January 4, 2025
ఆముదాలవలస: గుండెపోటుతో వైద్యుడు మృతి

ఆమదాలవలసకు చెందిన వైద్యుడు పీ.హర్షవర్ధన్(36) అనే వైద్యుడు గురువారం అర్ధరాత్రి గుండెపోటుతో మృతిచెందారు. ఆమదాలవలస మున్సిపాలిటీ పరిధిలోని బీ.ఆర్ నగర్‌కు చెందిన ఈయన శ్రీకాకుళంలో ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో వైద్యునిగా పనిచేస్తున్నారు. కాగా గురువారం రాత్రి తీవ్ర అస్వస్థతకు గురైన ఈయన గుండెపోటుతో మరణించారు. మృతునికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. వైద్యుడు మృతితో కుటుంబంలో విషాదం నెలకొంది.
Similar News
News November 18, 2025
గుప్పిడి పేట: సముద్రంలో తెప్ప బోల్తాపడి మత్స్యకారుడు మృతి

సముద్రంలో తెప్ప బోల్తా పడడంతో మంగళవారం ఉదయం గుప్పిడిపేటకు చెందిన మత్స్యకారుడు మృతి చెందాడు. పోలాకి మండలం గుప్పిడిపేట నుంచి ముగ్గురు మత్స్యకారులతో వేటకు బయలుదేరిన చెక్క రాజయ్య (45) తెప్పపై సముద్రంలోకి వెళుతుండగా బోల్తా పడి మునిగి మృతి చెందాడు. స్థానికులు మృతదేహాన్ని ఒడ్డుకు తీసుకువచ్చారు. మృతునికి భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు.

ఎచ్చెర్ల: నన్ను కాపాడండి సార్.. చిన్నారి వేడుకోలు..!

ఎచ్చెర్లలోని ముద్దాడకు చెందిన ఐదేళ్ల సింధు నందన్ అనారోగ్యంతో బాధపడుతున్నాడు. వైద్యులు లివర్ ట్రాన్స్ ప్లాంటేషన్ చేయాలని సూచించారు. అయితే ఆ చికిత్సకు రూ.25 లక్షలు ఖర్చవుతుందని తెలిపారు. తమ ఆర్థిత స్థోమత సరిగాలేదని ప్రభుత్వం ఆదుకుని తమ బిడ్డను బతికించాలని తల్లిదండ్రులు కోరుతున్నారు.